మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సినిమాలు.. ఒక టాలీవుడ్(Tollywood) లోనే కాదు ఇండియా వైడ్ పలు ఇండస్ట్రీలో రికార్డ్స్ కనిపిస్తాయి. ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ అయిన బాలీవుడ్(Bollywood) స్టార్స్ కూడా అందుకోని పారితోషకాన్ని తీసుకోని నేషనల్ మీడియా చేత ”బిగ్గర్ దెన్ బచ్చన్ – ది న్యూ మనీ మిషన్” అని అనిపించుకున్నాడు. ఇక చిరు నటించిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘ఇంద్ర’(Indra) అనేక రికార్డ్స్ ని నెలకొలిపింది. 2002లో విడుదలైన ఈ మూవీ 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ని అందుకొని అప్పట్లో టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ మూవీగా కాదు ఏకంగా సౌత్ ఇండస్ట్రీ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డుని బ్రేక్ చేయడానికి 3 ఏళ్ళ సమయం పట్టింది. రజినీకాంత్ ‘చంద్రముఖి’ సినిమాతో 2005లో ఇంద్ర రికార్డుని బ్రేక్ చేశాడు. ఇక టాలీవుడ్ లో అయితే 4 ఏళ్ళ తరువాత 2006లో మహేష్ పోకిరి సినిమా ఆ రికార్డ్స్ ని రీప్లేస్ చేసింది. కాగా ఇంద్ర సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీని ‘ఇంద్ర ది టైగర్’ అనే పేరుతో డబ్ చేసి టెలివిజన్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ మూవీ బాలీవుడ్ టెలివిజన్ రంగంలో అద్భుతాలు సృష్టించింది. ఈ మూవీకి హిందీ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ మూవీ రైట్స్ కొన్న ఛానల్.. ఈ సినిమాకి రేటింగ్ బాగా వస్తుండడంతో రెండు వారాలకు ఒకసారి ఇంద్ర చిత్రాన్ని ప్రసారం చేస్తూ వచ్చారు. ఆ ఛానల్ సీఈఓ ఈ సినిమా గురించి ఒకసారి ఇలా మాట్లాడారు.. “ఇంద్ర ది టైగర్ ఒక ఎవర్ గ్రీన్ మూవీ. మాకు ఎప్పుడు రేటింగ్స్ కావాలన్నా ఆ చిత్రాన్ని టెలికాస్ట్ చేస్తాం” అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఈ మూవీ గురించి 2015లో ఒక ప్రముఖ నేషనల్ మీడియా కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ రాసికొచ్చింది. “ఇంద్ర ది టైగర్ హిందీ టెలివిజన్ రంగంలో సుస్థిర స్థానాన్ని దక్కించుకుంది” అంటూ పేర్కొంది.
Also Read : Yash : హీరోగా మారుతున్న డ్యాన్స్ మాస్టర్ యశ్.. దిల్ రాజు నిర్మాణంలో సినిమా..