మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన రాజకీయ (Politics ) భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, తర్వాత కాంగ్రెస్‌లో కలిపిన చిరు, ఇక రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇటీవల బ్రహ్మానందం నటించిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్ ఈవెంట్(Brahma Anandam Pre-Release Event)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని ఇక సినిమాలకే అంకితం చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ICC Bans Shohely Akhter: బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్‌కు ఊహించని షాక్.. ఐదేళ్లపాటు నిషేధం!
చిరంజీవి రాజకీయ ప్రస్థానం చాలా ఊహించని మలుపులు తీసుకుంది. ప్రజారాజ్యం స్థాపన, ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవడం, తరువాత సినిమాల్లో తిరిగి రీఎంట్రీ ఇవన్నీ చిరు కెరీర్‌లో మరిచిపోలేని అధ్యాయాలు. అయితే, గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్‌ను తరచుగా ప్రస్తావిస్తున్న చిరు, జనసేనకు మద్దతుగా ఉన్నారనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి తాను ఇక రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. “ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటాను. కళామతల్లికి అంకితమవుతాను” అని స్పష్టం చేసారు. తాను పునరాగమనంపై ఎవ్వరూ అనవసర ఊహాగానాలు చేయనవసరం లేదని, ఇకపై తన లక్ష్యాలను పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తారని తెలిపారు.
చిరు వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో వివిధ చర్చలకు దారి తీశాయి. రాజకీయాల్లోకి మళ్లీ రానని స్పష్టత ఇచ్చిన చిరు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. జనసేన కోసం తాను ప్రత్యక్షంగా ప్రచారం చేస్తారా? లేదా? అనే ప్రశ్న అభిమానులలో తలెత్తుతోంది.