మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి..నేడు మెగాస్టార్ గా ఇండస్ట్రీ కి గాడ్ ఫాదర్ అయ్యాడు. 68 ఏళ్ల వయసుకు వచ్చినప్పటికీ ఇంకా యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తున్నాడు. నేడు చిరంజీవి పుట్టిన రోజు (Megastar Chiranjeevi Birthday) సందర్బంగా అభిమానులు మెగా సంబరాలు జరుపుకుంటున్నారు. పలు సేవ కార్యక్రమాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇదే క్రమంలో చిరంజీవి తాలూకా విశేషాలు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఇండస్ట్రీ లో అడుగుపెట్టి కోట్లు సంపాదించిన చిరంజీవికి బ్రాండ్ కార్లు వాడడం ఎంతో ఇష్టం. అందుకే ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను చిరు వాడుతుంటారు. మార్కెట్ లోకి ఏ కొత్త కారు వచ్చిన దానిపై ఫోకస్ చేస్తుంటాడు. బాగుందనిపిస్తే వెంటనే కోనేస్తుంటాడు. ప్రస్తుతం చిరంజీవి గ్యారేజ్ లో ఎలాంటి కార్లు ఉన్నాయి..వాటి ధరలు ఏంటి..అనేవి తెలుసుకుందాం.
రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ‘ఫాంటమ్’ (Rolls Royce Phantom) చిరంజీవి గ్యారేజిలో ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ అద్భుతమైన డిజైన్ కలిగి 6.8 లీటర్ వి12 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 460 Bhp పవర్ అండ్ 720 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser)
భారతీయ మార్కెట్లో విడుదలకాక ముందే ఈ కారును చిరంజీవి దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు వాడుతుంటారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే.
రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue)
ల్యాండ్ రోవర్ కంపెనీకి రేంజ్ రోవర్ వోగ్ ను కూడా చిరంజీవి వాడుతుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తుంది. కార్లతో పాటు చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. మొత్తం మీద చిరంజీవి చిత్రసీమలో అడుగుపెట్టి దాదాపు రూ. 1650 కోట్లకు పైగానే ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తుంది. కేవలం చిరంజీవే కాదు ఈయన ద్వారా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మిగతా వారు కూడా గట్టిగానే సంపాదించారు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప.
Read Also : Chiranjeevi Birthday Special : టాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు