Site icon HashtagU Telugu

Chiranjeevi : నాగబాబును కొట్టిన చిరంజీవి..ఎందుకంటే..!!

Chiru Nagababu

Chiru Nagababu

చిత్రసీమలో మెగా ఫ్యామిలీ అంటే ఎంత పాపులరో చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషి తో చిత్ర సీమలోకి అడుగుపెట్టి..ఇప్పుడు టాలీవుడ్ కే మహారాజయ్యారు చిరంజీవి. చిరంజీవి మొదలు పవన్ కళ్యాణ్ , నాగబాబు , అల్లు అర్జున్ , రామ్ చరణ్ , సాయి తేజ్ , వరుణ్ తేజ్ , వైష్ణవ్ తేజ్ , అల్లు శిరీష్ ఇలా మెగా ఫ్యామిలీ నుండి చిత్రసీమలోకి అడుగుపెట్టి రాణిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చిరంజీవి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. వాటిలో ఒకటి నాగబాబును కొట్టిన విషయం.”అమ్మకు చిన్ననాటి నుంచి అన్ని విషయాల్లో సాయంగా ఉండేవాడిని. ఒకరోజు ఒకేసారి రెండు పనులు చేయాల్సి వచ్చింది. అయితే నాగబాబుకు లాండ్రీ నుంచి బట్టలు తీసుకువచ్చే పని పురమాయించాను.
We’re now on WhatsApp. Click to Join.

నేను ఒక పని పూర్తి చేసుకుని వచ్చేసరికి నాగబాబు ఇంట్లోనే ఉన్నాడు. అది చూసి కోపంతో లాండ్రీ నుంచి బట్టలు తీసుకురాలేదా అని అడిగితే, లేదు నిద్రపోతున్నా అన్నాడు. కోపం ఆపుకోలేక కొట్టేశాను. అది చూసి అమ్మ నన్ను తిట్టేసింది కూడా. సాయంత్రం వరకూ ఎదురుచూసి నాన్న రాగానే విషయం మొత్తం ఆయనకు చెప్పేశా. అప్పుడు నాన్న కూడా వెళ్లి నాగబాబును మందలించేసరికి నాకు రిలీఫ్ అనిపించింది” అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగబాబు..తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు.

Read Also : Congress Candidates : 114 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు