Site icon HashtagU Telugu

Bhola Shankar Look: ట్యాక్సీ డ్రైవర్ గా చిరంజీవి.. వింటేజ్ లుక్స్ అదుర్స్

Bhola Shankar

Bhola Shankar

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కమిట్ అయిన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. జట్ స్పీడ్ తో తన సినిమాలను కంప్లీట్ చేస్తూ, ఇతర ప్రాజెక్టుల కథలను వింటున్నాడు. ఇప్పటికే సెట్స్ పై ఉన్న భోళా శంకర్ (Bhola Shanka) మూవీ ఆసక్తి రేపుతున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం భోళా శంకర్. “వాల్టేర్ వీరయ్య” గ్రాండ్ సక్సెస్ తర్వాత ఈ మూవీలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో తమన్నా భాటియా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ (Keerthy Suresh), సుశాంత్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లేబర్ డే (మే డే) రోజున చిత్రనిర్మాతలు కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. చిరంజీవి పాతకాలపు టాక్సీ డ్రైవర్‌గా టీ తాగుతూ మూడు పోస్టర్‌లను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక టీమ్ ఇటీవల హైదరాబాద్‌లో 80% షూటింగ్‌ను పూర్తి చేసిన ఇంటెన్స్ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను కంప్లీట్ చేసింది.

తదుపరి షెడ్యూల్ కోల్‌కతాలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత యూరప్‌లో చిరంజీవి, తమన్నా నటించిన సాంగ్ సీక్వెన్స్ ఉంటుంది. (Bhola Shanka) పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుని జూన్ నెలాఖరులోగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. డూడ్లీ సినిమాటోగ్రాఫర్‌గా, మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడిగా ఈ మూవీ ఆగస్ట్ 11, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read: Oral Sex: ఓరల్ సెక్స్ లో పాల్గొంటున్నారా.. అయితే బీ కేర్ ఫుల్