Vishwambhara : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాపై మొదటి నుంచీ ఫ్యాన్స్‌కి భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్, తాజాగా కేరళలోని అందమైన లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. కేరళ షెడ్యూల్ విజయవంతంగా ముగిసిన విషయాన్ని స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో “మన శంకరవరప్రసాద్ గారు కేరళలో ముచ్చటగా మూడో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైదరాబాదుకు వచ్చారు” అంటూ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో చిరంజీవి, అనిల్ రావిపూడి , చిత్ర యూనిట్ చార్టర్డ్ ప్లేన్‌లో కేరళ నుంచి బయల్దేరడం, తరువాత హైదరాబాదులో ల్యాండ్ అవడం కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా అందాల తార నయనతార నటిస్తోంది. ఇద్దరి కాంబినేషన్ మళ్లీ స్క్రీన్‌పై మెరిసే అవకాశం రావడంతో ప్రేక్షకులలో ఉత్సాహం పెరిగింది.
మెగా ఫ్యాన్స్‌ను మరింత ఎగ్జైట్ చేస్తున్న మరో విషయం ఏంటంటే, చిరంజీవి తనయ సుష్మిత ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండటం. సాహు గారపాటి కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మాణ బాధ్యతలు పంచుకుంటున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, టెక్నికల్ టీమ్ ఈ సినిమాను విజువల్ గ్రాండియర్‌గా తీర్చిదిద్దడానికి కసరత్తు చేస్తోంది.
ఈ సినిమా మాస్ , ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగా, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు అవుతుందన్న నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
CM Revanth Reddy : కులగణనలో తెలంగాణ మోడల్‌కు రోల్ మోడల్ హోదా