Paris Olympics 2024 : ఒలింపిక్స్ వేడుకల్లో చిరంజీవి సందడి

విశ్వంభరతో మెగాస్టార్ చిరంజీవి, గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ సినిమాలతో బీజీగా ఉన్నారు

Published By: HashtagU Telugu Desk
Chiru Olympic Games Paris 2

Chiru Olympic Games Paris 2

2024 పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) ప్రారంభోత్స‌వ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు క్రీడాకారులు మాత్రమే కాదు సినీ , రాజకీయ, బిజినెస్ ప్రముఖులు సైతం హాజరయ్యారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా, చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయేలా, చారిత్రక కట్టడాల మధ్యలో సెన్‌ నదిపై ఈ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. నదికి రెండు వైపులా కళాకారుల ప్రదర్శనలు, విన్యాసాలు అద్భుతంగా కొనసాగాయి.

We’re now on WhatsApp. Click to Join.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుటుంబ సమేతంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరై సందడి చేసారు. భార్య సురేఖతో కలిసి ఒలింపిక్‌ టార్చ్‌ ప్రతిరూపాన్ని పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోని చిరు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. పారిస్‌ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులందరికీ ప్రత్యేకంగా ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు.

కొద్దీ రోజులుగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ లండన్ ట్రిప్ లో ఉన్నారు. విశ్వంభరతో మెగాస్టార్ చిరంజీవి, గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ సినిమాలతో బీజీగా ఉన్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి కాగా, చిరంజీవి విశ్వంభర దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ గ్యాప్ లో స్వీట్ ఫ్యామిలీతో కూల్ ట్రిప్ వేశారు మెగాస్టార్. చిరంజీవి తన కుటుంబంతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్న ఫొటోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Read Also : BRS Effect : కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ఎత్తిపోత‌లు ప్రారంభం

  Last Updated: 27 Jul 2024, 05:15 PM IST