Burrakatha : టొరంటో లిఫ్ట్‌ ఆఫ్‌ ఫిలిం ఫెస్టివల్‌ కు ‘చిల్కూరి బుర్రకథ’కు ఎంపిక

పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది

  • Written By:
  • Updated On - May 26, 2024 / 03:29 PM IST

బుర్రకథ (Burrakatha) ఒక జానపద కళారూపం. పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకొంటూ సరదా సరదాగా సాగిపోయే కళారూపం బుర్రకథ. పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది. హరికథలో కొంత సంప్రదాయముద్ర ఉండి బుర్రకథ పూర్తిగా జానపద కళారూపం. అలాంటి ఈ బుర్రకథలు ప్రస్తుతం కనుమరుగై పోతున్న వేళ..చిల్కూరి బుర్రకథ బృందం ప్రదర్శించిన ‘ శాంసన్‌ అండ్‌ దెలీలా ‘ (‘Samson and Delilah’) అనే బుర్ర కథ టొరంటో లిఫ్ట్‌ ఆఫ్‌ ఫిలిం ఫెస్టివల్‌ (Toronto Lift-Off Film festival) లో అధికారికంగా ఎంపికై వార్తల్లో నిలిచింది.

We’re now on WhatsApp. Click to Join.

హైదరాబాద్‌కు చెందిన చిల్కూరి శ్యామ్‌ రావు, చిల్కూరి వసంతరావు, చిల్కూరి సుశీల్‌ రావు అనే ముగ్గురు సోదరులు ఈ బుర్రకథను ప్రదర్శించి అలరించారు. వీరుడైన శాంసన్‌ అందమైన దెలీలాతో ఎలా ప్రేమలో పడతాడనే బైబిల్‌ కథ ఆధారంగా ఈ బుర్రకథను ప్రదర్శించడం జరిగింది. ప్రేమ, ద్రోహం అలాగే ఎదురించి పోరాడటం వంటి అంశాలను ఈ బుర్రకథలో జోడించడం జరిగింది. చిల్కూరి బుర్రకృథ బృందం 1970 చివర, 1980 తొలినాళ్లలతో తమ ప్రదర్శనలను ప్రారంభించింది. అప్పట్నుంచి హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాల్లో అనేక బుర్రకథ ప్రదర్శనలను ఇస్తూ వస్తున్నారు.

Read Also : Swati Maliwal : అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి : స్వాతి మలివాల్