India Top Stars: ఇండియన్ టాప్ స్టార్స్’ లిస్టులో ఆ హీరోదే ఫస్ట్ ప్లేస్!

ఓ సంస్థ ఇండియా టాప్ స్టార్ జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ఎవరు ముందున్నారో తెలుసా?

Published By: HashtagU Telugu Desk
Top Star

Top Star

బాలీవుడ్‌లో (Bollywood) షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్‌ (Akshay Kumar) లతో పాటు ప్రపంచాన్నే ప్రభావితం చేసే నటులు కూడా ఉన్నారు. ఈ నటీనటులకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకవైపు నటనతో, మరోవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ తో తిరుగులేని స్టార్స్ గా చెలామణి అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ మీడియా ఏజెన్సీ ఓర్మాక్స్ డిసెంబర్ నెలలో ‘మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ ఆఫ్ ఇండియా’ తాజా జాబితాను విడుదల చేసింది. అయితే అన్యూహ్యంగా అక్షయ్ కుమార్ (Akshay Kumar) నెం. 1 స్థానం నిలిచినట్టు సర్వేలో తేలింది. Ormax ప్రకారం.. డిసెంబర్ 2022లో అక్షయ్ అత్యంత ప్రజాదరణ నటుడిగా నిలువగా, ఆ తర్వాత షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా పరిశ్రమను శాసించిన ఖాన్‌లు ఓర్మాక్స్ జాబితాలో వెనుకబడిపోయారు.

బాలీవుడ్ కింగ్ ఖాన్ పఠాన్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పలు వివాదాలతో దోస్తీ చేస్తోంది. ఈ సినిమా కారణంగా షారుఖ్ వార్తలో వ్యక్తిగా నిలిచాడు. దీంతో షారుఖ్ ఖాన్ అత్యంత ప్రజాదరణ నటుడిగానూ గుర్తింపు పొందాడు. అక్షయ్ కుమార్ తో పొలిస్తే కొన్ని అంశాల్లో మాత్రం ముందే ఉన్నాడు. సావరియా స్టార్ రణబీర్ కపూర్ తన బ్రహ్మాస్త్రం తర్వాత 5వ స్థానం కైవసం చేసుకున్నాడు: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మాత్రం తొమ్మిదో స్థానంలో నిలిచాడు. అయితే అక్షయ్ కుమార్ (Akshay Kumar) పలు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపర్చాడు. కానీ ఇప్పటికీ ఆయనే జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం.

ఇండియా టెన్ టాప్ స్టార్స్ వీళ్లే

అక్షయ్ కుమార్

షారుఖ్ ఖాన్

సల్మాన్ ఖాన్

రణబీర్ కపూర్

అజయ్ దేవగన్

రణవీర్ సింగ్

వరుణ్ ధావన్

అమీర్ ఖాన్

కార్తీక్ ఆర్యన్

Also Read: Pooja Hegde With Nag: నాగ్-పూజాహెగ్డే కలిశారు.. ఎందుకో తెలుసా?

  Last Updated: 09 Jan 2023, 11:09 PM IST