Chandramukhi 2 Talk : చంద్రముఖి 2 టాక్

పీ వాసు కథను నడిపించిన తీరు సినిమాకు పెద్ద ప్లస్ అంటున్నారు. హీరో రాఘవ లారెన్స్ రెండు భిన్నమైన పాత్రల్లో నటించారని... రజినీతో పోలిస్తే.. రాఘవ లారెన్స్ నటన తేలిపోయిందని

  • Written By:
  • Publish Date - September 28, 2023 / 12:28 PM IST

చంద్రముఖి (Chandramukhi ) ..ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2005 పి వాసు డైరెక్షన్లో రజనీకాంత్ , నయనతార , జ్యోతిక , ప్రభు కలయికలో వచ్చిన ఈ మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా చంద్రముఖి 2 వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ , నటుడు , మ్యూజిక్ డైరెక్టర్ అయినా రాఘవ లారెన్స్ (Ragava) ప్రధాన పాత్రలో తెరకెక్కగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా (Kangana ) హీరోయిన్ గా నటించింది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో వ‌డివేలు, ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, విఘ్నేష్‌, వై.జి.మ‌హేంద్ర‌న్ .. రావు ర‌మేష్‌, సురేశ్ మీన‌న్‌ నటించగా.. ఈ సినిమాకి ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆంథోని ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేసాడు.

భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాల బాగుందని , పీ వాసు కథను నడిపించిన తీరు సినిమాకు పెద్ద ప్లస్ అంటున్నారు. హీరో రాఘవ లారెన్స్ రెండు భిన్నమైన పాత్రల్లో నటించారని… రజినీతో పోలిస్తే.. రాఘవ లారెన్స్ నటన తేలిపోయిందని కామెంట్స్ వేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ లో కంగనరనౌత్ ఎంటర్ అవ్వలేదట. ఎంఎం కీరవాణి సాంగ్స్ పర్వాలేదని అంటున్నారు. వడివేలు కామెడీ వర్కౌట్ అయింది. ఇక విజువల్స్ బాగున్నాయి. ఎమోషన్స్ కూడా వర్క్ అయినట్లు చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం కథ నెమ్మదిగా సాగిందని దీనివల్ల కాస్త బోర్ ఫీలింగ్ కలుగుతుందని చెపుతున్నారు.

Read Also : Green India Challenge: గణేశ్ నిమజ్జనంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. జూట్ బ్యాగ్స్ పంపిణీ