సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) అంత్యక్రియలు ముగిసాయి. అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న చంద్ర మోహన్.. హైదరాబాద్ అపోలో హాస్పటల్ లో తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ మరణ (Chandra Mohan Dies) వార్త తెలిసి యావత్ చిత్ర సీమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేసిందిది. కేవలం సినీ ప్రముఖులే కాక రాజకీయ నేతలు సైతం చంద్రమోహన్ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకున్నారు.
ఈరోజు మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశానవాటిక (Panjagutta Smashana Vatika)లో అంత్యక్రియలు పూర్తి చేశారు. నటుడు చంద్ర మోహన్ సోదరుడు దుర్గాప్రసాద్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి. అమెరికాలో ఉన్న పెద్ద కుమార్తె నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో నేడు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్ లోని ఆయన నివాసం నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర జరిగింది. ఈ యాత్రలో ఆయన అభిమానులు పాల్గొని నివాళ్లు అర్పించారు.
Read Also : Forehead Tattoo : నుదిటిపై టాటూగా లవర్ నేమ్.. విపరీతంగా ట్రోల్ చేసిన నెటిజన్లు.. చివరికిలా..