NBK109 లక్కీ ఛాన్స్ పట్టేసిన తెలుగు అమ్మాయి..!

NBK109 నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబినేషన్ లో భారీ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధ శ్రీనాథ్

Published By: HashtagU Telugu Desk
Chandini Chowdhary Lucky Chance In Nbk 109

Chandini Chowdhary Lucky Chance In Nbk 109

NBK109  నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబినేషన్ లో భారీ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో తెలుగు అమ్మాయి చాందిని చౌదరికి లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. బాలయ్య బాబు సినిమాలో ఛాన్స్ అంటే అది అమ్మడి కెరీర్ కు మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు.

ఈమధ్య సోలో సినిమాల్లో రాణిస్తున్న చాందిని చౌదరి త్వరలో విశ్వక్ సేన్ గామి సినిమాతో రాబోతుంది. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాలని చూస్తుంది చాందిని. బాలకృష్ణ సినిమాలో ఆమెది ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది. ఈ సినిమాతో చాందిని తప్పకుండా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని తెలుస్తుంది.

తెలుగు అమ్మాయిగా చాందిని చౌదరి ముందు షార్ట్ ఫిలంస్ తో కెరీర్ ప్రారంభించగా ఆ తర్వాత వెండితెర ఛాన్స్ లు వచ్చాయి. హీరోయిన్ గా స్టార్ రేంజ్ దక్కించుకోలేదు కానీ సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది అమ్మడు.

Also Read : Vijay Devarakonda Family Star Teaser : ఫ్యామిలీ స్టార్ టీజర్.. దేవరకొండ ఈసారి పర్ఫెక్ట్ ప్లాన్ తో దిగుతున్నాడుగా..!

  Last Updated: 04 Mar 2024, 10:33 PM IST