Site icon HashtagU Telugu

Chandini Chowdary : కమర్షియల్ హీరోయిన్ ఛాన్సులు రావడానికి ఇంకెంత ప్రూవ్ చేసుకోవాలి..? చాందిని సంచలన వ్యాఖ్యలు..

Chandini Chowdary

Chandini Chowdary

Chandini Chowdary : మన తెలుగమ్మాయి చాందిని చౌదరి షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. కొత్త కొత్త కథలు, పాత్రలతో మెప్పిస్తుంది. కలర్ ఫోటో, మను, గామి.. ఇలా మంచి హిట్ సినిమాలు ఉన్నా కూడా చాందిని చౌదరికి పెద్ద సినిమాల్లో, కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు రావట్లేదు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాలు కూడా ప్రయోగాత్మక సినిమాలే.

తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అజయ్ ఘోష్, చాందిని చౌదరి ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించారు.

ఈ క్రమంలో చాందిని మంచి సినిమాలు, పాత్రలు చేస్తుంది, మంచి యాక్టర్ కూడా కానీ ఎందుకు కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు రావట్లేదు, మీరు చేయాలని అనుకోవట్లేదా అని అడగ్గా చాందిని చౌదరి సమాధానమిస్తూ.. నా కెరీర్ మొదట్నుంచి నాకు కమర్షియల్ సినిమా చేయాలని ఉంది. అది తప్ప అన్ని రకాల పాత్రలు నేను చేసాను. కమర్షియల్, పెద్ద సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు రావడానికి ఇంకెంత ప్రూవ్ చేసుకోవాలో తెలియట్లేదు. మరి నాకు ఎందుకు ఛాన్సులు ఇవ్వట్లేదు నిర్మాతలు, డైరెక్టర్స్ కే తెలియాలి అని తెలిపింది. దీంతో చాందిని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి చాందినికి భవిష్యత్తులో అయినా కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు వస్తాయా చూడాలి.

 

Also Read : War 2 : వార్ 2 యాక్షన్ సీక్వెన్స్ కోసం.. మార్వెల్ మూవీ స్టంట్ మాస్టర్..