Niharika Konidela: పుకార్లకు చెక్.. బ్యూటిఫుల్ పిక్ షేర్!

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించడంతో చర్చనీయాంశంగా మారింది.

  • Written By:
  • Publish Date - March 14, 2022 / 01:51 PM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించడంతో చర్చనీయాంశంగా మారింది. తన భర్త చైతన్యకు దూరంగా ఉంటుందనీ.. పెళ్లి గురించి అనేక గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో అవన్నీ ఉత్త పుకార్లేనని నిహర భర్త చైతన్య తేల్చేశాడు. నిహారికకు సంబంధించిన అందమైన ఫొటోను ఇన్ ష్టాలో షేర్ చేశాడు. రెండ్రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నిహారిక కుండలు నేర్చుకుంటూ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఈ ఫొటోలో నిహారిక కుండలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ కెమెరాకు పోజులిస్తుండగా.. ఆమె భర్త ఫొటోలను బంధించాడు. నటుడు నాగబాబు కుమార్తె, వరుణ్ తేజ్ సోదరి నిహారిక టాలీవుడ్‌లో తనకంటూ పేరు తెచ్చుకుంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే నెటిజన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ను డియాక్టివేట్ చేసిన తర్వాత వైవాహిక జీవితం గురించి పుకార్లు వినిపించాయి. వీటికి చెక్ పెట్టేలా చైతన్య ఈ ఫొటోను షేర్ చేశాడు.