Producer Chadalavada Help to Fish Venkat : ఫిష్ వెంకట్ కు ప్రముఖ నిర్మాత సాయం

Actor Fish Venkat : అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్ కు ఎవరైనా సాయం చేస్తే బాగుండని వేడుకుంటున్నారు

Published By: HashtagU Telugu Desk
Producer Chadalavada Sriniv

Producer Chadalavada Sriniv

Producer Chadalavada Srinivasa Rao Donates 1 Lakh To Fish Venkat : ఫిష్ వెంకట్ (Fish Venkat) ఆరోగ్యానికి (fish venkat Health) సంబంధించి అంత మాట్లాడుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్ కు ఎవరైనా సాయం చేస్తే బాగుండని వేడుకుంటున్నారు. సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఫిష్ వెంకట్ ఆరోగ్యం గురించి చర్చ నడుస్తుండడం తో చిత్రసీమ కదిలి వస్తుంది. తాజాగా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆదుకున్నారు.

తొడగొట్టు చిన్నా అనే డైలాగ్ తో ఫిష్ వెంకట్ (Fish Venkat) ఎంతో ఫేమస్ అయ్యాడు

ఆది సినిమాలో తొడగొట్టు చిన్నా అనే డైలాగ్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకొని వెంకట్..కమెడియన్ గా విలన్ గా దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించాడు. సినిమాల్లో బాగా ఎదిగిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దయనీయ స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు ఎంతోమందికి దానాలు చేసిన ఫిష్ వెంకట్ ఇప్పుడు చేయి చాచే స్థితిలో ఉన్నాడు. గతంలో వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఆయన్ను అనారోగ్యం ఇంటికే పరిమితం చేసింది. అసలు ఏమైంది వెంకట్ కు అని ఆరా తీస్తే.. త‌న రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తోందని, ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేసుకుంటున్నానని తన పరిస్థితి గురించి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

వెంకట్ (Fish Venkat Health) దీనస్థితి చూసి చలించిపోయిన నిర్మాత

షుగర్ వల్ల కాలు బాగా లావు అయ్యిందని, నాలుగేళ్ళ క్రితం ఆపరేషన్ చేసుకున్నానని, ఆ తర్వాత కూడా కాలుకు ఎఫెక్ట్ అయింది. అప్పట్నుంచి ఇలా కాలు మీద చర్మం ఉండిపోతుందని,రోజు రోజుకు ఆరోగ్యం క్షిణిస్తుందని..కొడుకులు కూడా పట్టించుకోవడం లేదని , ఎవరైనా దాతలు సాయం చేస్తే బాగుంటుందని కన్నీరు పెట్టుకుంటున్నారు. వెంకట్ దీనస్థితి చూసి చలించిపోయిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రూ. లక్ష సాయాన్ని అందించారు. ఇతర సినీ ప్రముఖులు కూడా ఫిష్ వెంకట్ను ఆదుకోవాలని కోరారు. అటు తనకు సాయం చేసిన నిర్మాతకు వెంకట్ ధన్యవాదాలు తెలిపారు.

Read Also : Game Changer : శంకర్, దిల్ రాజు పై చరణ్ అభిమానుల ఆగ్రహం.. నెట్టింట నెగటివ్ ట్రెండ్..

  Last Updated: 05 Sep 2024, 09:03 PM IST