Bengaluru Rave Party : నటి హేమకు మరోమారు బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు

అనారోగ్యంతో బాధపడుతున్నానని..వారం రోజులు గడువు ఇవ్వాలని కోరింది. కేవలం హేమ మాత్రమే కాదు మిగతావారు కూడా ఎవరూ హాజరుకాకపోవడంతో పోలీసులు సీరియస్ అయ్యారు

  • Written By:
  • Publish Date - May 29, 2024 / 06:48 PM IST

బెంగుళూర్ రేవ్ పార్టీ (Bengaluru Rave Party) లో అడ్డంగా దొరికిన నటి హేమ(Hema)కు బెంగుళూర్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసారు. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కూడా దొరకడంతో.. ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వారిలో 86 మంది బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. వీరిలో నటి హేమకూడా ఒకరు. దీంతో ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే హేమ విచారణకు హాజరు కాలేదు.

We’re now on WhatsApp. Click to Join.

అనారోగ్యంతో బాధపడుతున్నానని..వారం రోజులు గడువు ఇవ్వాలని కోరింది. కేవలం హేమ మాత్రమే కాదు మిగతావారు కూడా ఎవరూ హాజరుకాకపోవడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఇద్దరు కార్ ఓనర్లకు, ఎమ్మెల్యే కాకాని కార్ స్టిక్కర్ ఉన్న కార్ ఓనర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి మరోసారి సీసీబీ పోలీసులు వివిధ తేదీల్లో విచారణకు రావాలని నోటీసులిచ్చారు. జూన్​ 1న స్వయంగా హేమ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

మే 20వ తేదీ రాత్రి బెంగళూరు శివార్లలోని హెబ్బగోడి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని జీఆర్​ ఫామ్​ హౌస్​లో రేవ్​ పార్టీ జరిగింది. ఈ విషయంపై సీసీబీ పోలీసులు తెలుసుకుని దాడి చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత ఘటనాస్థలంలో కొన్ని మాదకద్రవ్యాలు, ఆంధ్రప్రదేశ్​ ఎమ్మెల్యే పాసు ఉన్న కారు కూడా లభ్యమయ్యాయి. పార్టీలో పాల్గొన్న 103 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 86 మందికి పాజిటివ్​ వచ్చింది. అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. అలాగే పార్టీ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై వాసు, యం.అరుణ్‌కుమార్‌, నాగబాబు, రణధీర్‌బాబు, మహ్మద్‌ అబూబకర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

Read Also : TTD Deputy EE Sri Lakshmi: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్