Bellamkonda Sreenivas : సినీనటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న జర్నలిస్ట్ కాలనీ వద్ద ఆయన కారును రాంగ్‌రూట్‌లో డ్రైవ్ చేశారు. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్‌ను ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ అడ్డుకున్నారు. కానిస్టేబుల్ నరేష్‌తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. అందువల్లే ఆయనపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ జర్నలిస్ట్ కాలనీలోని తన ఇంటికి వెళ్తుండగా మే 13న సాయంత్రం జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read :Who is Ashok Elluswamy: ‘టెస్లా’కు దిక్సూచి అశోక్ ఎల్లుస్వామి.. ఆయన ఎవరు ?
అసలేం జరిగింది ?
జూబ్లీహిల్స్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీలోని చౌరస్తా వద్ద నుంచి రాంగ్‌రూట్‌లో తన ఇంటికి వెళ్లేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ యత్నించగా ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకున్నారు. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, నరేష్ మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ చెబుతున్నా వినకుండా అక్కడి నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ వెళ్లిపోయారు. ఈవిధంగా కారులో బెల్లంకొండ శ్రీనివాస్ తప్పించుకునే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్‌కు ప్రమాదం తప్పిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. బెల్లంకొండపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ హీరోలే ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read :Kancha Gachibowli : పర్యావరణ నష్టాన్ని పూడ్చకపోతే వాళ్లు జైలుకే.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మే 30న భైరవం సినిమా రిలీజ్
ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా తెలుగు సినిమాల్లోకి బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) ఎంట్రీ ఇచ్చారు. ఈయన 2014లో అల్లుడు శీను మూవీతో హీరోగా అరంగేట్రం చేశారు. డ్యాన్సులు, ఫైట్లతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రాక్షసుడు సినిమాతో తన యాక్టింగ్ ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఆయన ఫ్లాప్ సినిమాలకు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా బెల్లంకొండ సినిమాలకు హిందీ వర్షన్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన భైరవం సినిమా మే 30న రిలీజ్ కానుంది. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు.