సామాన్య ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న బెట్టింగ్ యాప్(Betting Apps)లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు 11 మంది ప్రముఖ యూట్యూబర్లపై కేసు నమోదు చేశారు. హర్ష సాయి, సుప్రీత, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, రీతూ చౌదరి, టేస్టీ తేజ, అజయ్, భయ్యా సన్నీ యాదవ్, సుదీర్ రాజు, కిరణ్ గౌడ్ లాంటి సోషల్ మీడియా సెలబ్రిటీలపై కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. వీరు తమ వీడియోల ద్వారా వీక్షకులను బెట్టింగ్ యాప్‌ల వైపు ఆకర్షిస్తూ, భారీ మొత్తంలో డబ్బులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Revanth Reddy’s Appeal : కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానించుకున్న యూట్యూబర్లు ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం బాధాకరమని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Influence ఉన్న ప్రముఖులు తప్పుడు మార్గాలను ప్రోత్సహించడం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీరు ప్రోత్సహించిన యాప్‌ల ద్వారా ఎంతో మంది యువత ఆర్థికంగా నష్టపోయారని, ఈ చర్యలు మరింత కఠినంగా ఉండాలని కోరుతున్నారు.
Uppal Stadium: హైదరాబాద్‌లో 9 ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఉప్పల్ స్టేడియంలోకి ఇవి నిషేధం!
ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల వేలాది మంది మోసపోయిన నేపథ్యంలో ఇకపై ఇలాంటి ప్రమోషన్‌లను నియంత్రించేందుకు పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఇలాంటి యాప్‌లను ప్రమోట్ చేయడంతో యువత కోటి కోట్లు పోగొట్టుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోలేర్స్ మాత్రమే కాకుండా, ఈ యాప్‌లపై మరింత గట్టి నియంత్రణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరించే ఏ సంస్థకైనా, వ్యక్తికైనా కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.