Site icon HashtagU Telugu

Betting Apps : రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ సహా పలువురు సినీ ప్రముఖులపై కేసు !

ED Investigation

ED Investigation

Betting Apps : బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపుర్ పీఎస్‌లో తాజాగా పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులపై కేసులు నమోదయ్యాయి. నటీనటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సహా మొత్తం 25 మంది ఈ జాబితాలో ఉన్నారు. సినీ ప్రముఖుల జాబితాలో రానా దగ్గుబాటి, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్‌ ఉన్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లలో అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్‌, వసంతి కృష్ణన్‌, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్‌, పండు, పద్మావతి, ఇమ్రాన్‌ఖాన్‌, విష్ణు ప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్‌, యాంకర్‌ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత ఉన్నారు. మియాపూర్‌ వాసి ప్రమోద్‌ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: BCCI Cash Prize: టీమిండియాకు భారీ న‌జ‌రానా.. రూ. 58 కోట్లు ప్ర‌క‌టించిన బీసీసీఐ!

ఇక ఇందులో టేస్టీ తేజ, యాంకర్ విష్ణుప్రియ సహా పలువురు విచారణకి కూడా హాజరయ్యారు. అలానే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువుర్ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఇక వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. డబ్బులు తీసుకొని తమ సోషల్ మీడియా ద్వారా పలు గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌ని వీళ్లు ప్రమోట్ చేశారు. దీని ద్వారా ఎంతోమంది తమ డబ్బులు, ప్రాణాలు కూడా కోల్పోయారు.

గతంలో తాము ప్రమోట్ చేసినందుకు చింతిస్తున్నామని.. తెలిసో తెలియకో చేసిన తప్పుని క్షమించాలంటూ కోరారు. అయినా కానీ చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే అంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు. మొత్తానికి ఇలా పలువురిపై కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఈ బెట్టింగ్ యాప్స్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఒక్కొక్కరిగా అలర్ట్ అయ్యారు. ఈ మధ్య చాలా మంది సెలబ్రెటీలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా దీనిపై రియాక్ట్ అయ్యారు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌ని దయచేసి వాడొద్దని, అలానే ప్రమోట్ చేయొద్దంటూ కోరారు.

Read Also: Phone tapping case : హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట