Case Against Allu Arjun: టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌పై కేసు (Case Against Allu Arjun) నమోదైంది. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో సినిమా యూనిట్, హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్‌పై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. చిత్ర ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందడం తెలిసిందే. రేవంత్ మృతికి కారణం ఏంటనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇకపోతే డిసెంబర్ 5వ తేదీన అంటే నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటున్నట్లు చిత్రయూనిట్ చెబుతోంది. అయితే గత రాత్రి నుంచే పలు చోట్ల ప్రీమియర్ షోలు మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. దీంతో అక్కడున్న పోలీసులు అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సినిమా చూడటానికి వచ్చిన రేవతి అనే మహిళ మృతిచెందింది. అలాగే ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆమె కూతురుకు కూడా గాయాలైనట్లు సమాచారం.
Also Read: Vaibhav Suryavanshi: 13 ఏళ్ళ బుడ్డోడు వైభవ్ ఊచకోతకు రాజస్థాన్ ఫిదా
రేవతి మృతిపై అల్లు అర్జున్ టీమ్ స్పందించినట్లు వార్తలు వస్తోన్నాయి. రేవతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, ఆమె కుమారుడికి అయ్యే వైద్య ఖర్చులను సైతం అల్లు అర్జునే భరిస్తారని నిర్మాత బన్నీ వాసు చెప్పినట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో సినిమా కోసం వచ్చి ఓ మహిళ చెందటం ఇదే తొలిసారి. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు సైతం కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.