Samantha: మళ్లీ ప్రేమలో పడొచ్చు కదా అంటూ సమంతకు సలహా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన బ్యూటీ?

ఎవరి సపోర్ట్ లేకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతుంది సమంత.

  • Written By:
  • Publish Date - March 27, 2023 / 09:24 PM IST

Samantha: ఎవరి సపోర్ట్ లేకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతుంది సమంత. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక వ్యక్తిగతంగా ఎన్నో సవాలు ఎదుర్కొని ముందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.

గతంలో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. నాగచైతన్యతో చాలా హ్యాపీగా బతికింది. ఆయనే తన సర్వసం అన్నట్లుగా జీవించింది. కానీ ఏం జరిగిందో తెలియదు ఇద్దరు తమ పెళ్లి జీవితానికి ముగింపు పలికారు. విడిపోతున్నాము అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సమంత అభిమానులు ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

వారిద్దరు మళ్ళీ కలిస్తే బాగుండు అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. కానీ అది జరిగే పని కాదు అని అర్థమవుతుంది. విడాకుల తర్వాత సమంత ఎంతో డిప్రెషన్ కి గురైంది. సోషల్ మీడియా ద్వారా బాగా రిఫ్రెష్ అవ్వడానికి ప్రయత్నించింది. ఇక తప్పదు అన్నట్లుగా గుండె భారంతో ముందుకు కొనసాగింది. వచ్చిన సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతుంది.

ఇక ఆ మధ్యనే తను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి తో బాధపడుతున్న విషయం కూడా తెలిపి అందరిని మరింత బాధపెట్టింది. ఇక ఒకవైపు దానికి చికిత్స తీసుకుంటూనే మరోవైపు తన సినిమా జీవితాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందులో ఆమె నటించిన శాకుంతలం త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలో శాకుంతలం ప్రమోషన్స్ లో సోషల్ మీడియాలలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది సమంత. అయితే తాజాగా ట్విట్టర్లో ఓ అభిమాని.. నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాదని నాకు తెలుసు. కానీ మీరు మళ్ళీ ఎవరినైనా ప్రేమించొచ్చు కదా అంటూ సమంతకు సలహా ఇవ్వగా.. వెంటనే సమంత.. మీరు ప్రేమించినంతగా నన్ను మరెవరు ప్రేమించగలరు అంటూ లవ్ సింబల్ తో సమాధానం ఇచ్చింది. దీంతో ఆమె సమాధానం చూసి ఆమె అభిమానులంతా ఫిదా అవుతున్నారు.