Site icon HashtagU Telugu

Janhvi On Board: క్రేజీ అప్డేట్.. ఎన్టీఆర్ పక్కన జాన్వీ ఫిక్స్!

Janhvy And Jrntr

Janhvy And Jrntr

ఆచార్య ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ కొరటాల (Koratala) చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆ సినిమా ఘోరంగా ఫెయిల్ కావడం, దర్శకుడి వైఫల్యం అని మెగాస్టార్ రెండుసార్లు  చెప్పడంతో కొరటాల డైలమాలో పడిపోయాడు. ఈ నేపథ్యంలో #NTR30 సినిమా ఆలస్యమవుతుండటం కూడా హట్ టాపిక్ గా మారుతోంది. వాస్తవానికి సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది.  కానీ కొరటాల పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ ఎవరు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.

లెటెస్ట్ సమాచారం ఏంటంటే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చివరకు #NTR30పై సంతకం చేయడానికి అంగీకరించినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. గుడ్ లక్ జెర్రీ (OTT విడుదల), మిలీ వంటి బ్యాక్-టు-బ్యాక్ ఫ్లాప్‌లు ఆమెను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో ఆమె తండ్రి బోనీ కపూర్ ఈ సమయంలో తెలుగు అవకాశాలను వదులుకోవడం మంచిది కాదని సూచించినట్టు తెలుస్తోంది. అయితే చిరు-చరణ్ కాంబో కూడా తెరపై మ్యాజిక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఈ కాంబోను మాత్రం కొరటాలను బాగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

Also Read: Janhvi On Board: క్రేజీ అప్డేట్.. ఎన్టీఆర్ పక్కన జాన్వీ ఫిక్స్!