టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన రాయదుర్గంలో రూ. వేల కోట్ల విలువైన 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ పత్రాలతో ప్రయత్నించినట్లు సమాచారం అందింది. ఈ ఘటనపై 20 ఏళ్లపాటు హైకోర్టు మరియు సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగాయి. సుప్రీం కోర్టు ఆయన సమర్పించిన పత్రాలను నకిలీగా తేల్చడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్‌ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు సినీ పరిశ్రమలో పెద్ద చర్చ గా మారింది.
కాగా వారం క్రితం కూడా పోలీసులపై దాడి చేసి శివరామకృష్ణ వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ తన అనుచరులతో కలిసి ఓయూ పోలీస్ స్టేషన్‌లో హంగామా చేశారు. ఓ కేసు విషయమై నిర్మాత శివరామకృష్ణ (Burugapally Siva Rama Krishna)ను ఇన్‌స్పెక్టర్ పోలీస్ స్టేషన్ (OU Police Station)కు పిలిపించారు. అయితే నన్ను పోలీస్ స్టేషన్‌కి పిలుస్తావా అంటూ ఇన్‌స్పెక్టర్‌పై శివరామకృష్ణ దాడి చేసారు. రామకృష్ణ తో పాటు అతని అనుచరులు.. ఇన్‌స్పెక్టర్ సహా మిగితా పోలీసుల మీద దాడికి పాల్పడ్డారు.
ఇక శివరామకృష్ణ సినీ కెరియర్ విషయానికి వస్తే..సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమాతో నిర్మాతగా మారిన ఈయన.. అందరి బంధువయ, మహేశ్ బాబుతో యువరాజు, వెంకటేశ్ తో ప్రేమంటే ఇదేరా, రవితేజ తో దరువు , యువత, రైడ్, ఏమో గుర్రం ఎగురావచ్చు వంటి సినిమాలను నిర్మించారు.
Read Also : Kalyani Priyadarshan Wedding : కళ్యాణి ఇలాంటి పని చేసిందేంటి..ఫ్యాన్స్ షాక్