Site icon HashtagU Telugu

Pawan Kalyan Birthday : పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన బన్నీ..వార్ చల్లారినట్లేనా..?

Hbdy Pawan

Hbdy Pawan

పవర్ స్టార్ , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (Pawan Kalyan Birthday) ఈరోజు. ఈ సందర్బంగా మెగా అభిమానులు , సినీ ప్రముఖులు , జనసేన నేతలు , శ్రేణులు , తెలుగు రాష్ట్ర ప్రజలు ఇలా ప్రతి ఒక్కరు ఆయనకు బెస్ట్ విషెష్ అందిస్తున్నారు. ప్రధాన నగరాల్లో అర్ధరాత్రి నుండి పుట్టిన రోజు వేడుకలు జరుపుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రేండింగ్ నడుస్తుంది.

ఇక మెగా కుటుంబ సభ్యులు సైతం పవన్ కళ్యాణ్ కు బెస్ట్ విషెష్ అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలిపారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ” కళ్యాణ్ బాబు.. ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ” అని రాసుకొచ్చారు.

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు. ‘జెండా పట్టిన జనసైనికులకి, నమ్మి నడిచిన నాయకులకి, నువ్వొస్తే మార్పు తెస్తావ్ అని ఎదురుచూసే నాలాంటి ఎంతో మందికి ఈ ఏడాది మర్చిపోలేని బహుమానం లభించింది. ఉన్నత విలువలున్నవాడు డిప్యూటీ సీఎంగా జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కాబట్టి మరీ ప్రత్యేకం. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు జనసేనాని’ అని ట్వీట్ చేశారు.

‘మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ & డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

“చిన్నప్పుడు తన బాబాయ్ కాళ్లు నొక్కుతుండగా తీసిన ఫొటోను వరుణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ధర్మం వైపు మీరు అనుసరించిన మార్గం, ఇతరులకు సహాయం చేయాలనే మీ అచంచలమైన సంకల్పం స్ఫూర్తిదాయకం. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ మై పవర్ స్టార్మ్! అని ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

వీరిందరిలో అల్లు అర్జున్ విషెష్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్..దగ్గరి నుండి మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకపోవడం వరకు ఇరు ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ ఆ మధ్య సినిమాల్లోని సాంస్కృతిక మార్పులను, కొన్నేళ్లుగా హీరోల చిత్రణను వివరించారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారని, ఇప్పుడు సినిమాల్లో చెట్లను నరికి అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ నటించిన గంధడ గుడి చిత్రంలో అడవుల సంరక్షణ గురించి మాట్లాడారని పవన్‌ ఎత్తిచూపారు. స్మగ్లర్ల నుంచి అడవిని కాపాడే ఫారెస్ట్ ఆఫీసర్ కథే ఈ సినిమా అని తెలిపారు. “సంస్కృతి ఎలా మారిందో నేను ఇటీవల నా అధికారులతో పంచుకున్నాను. నలభై ఏళ్ల క్రితం అడవులను కాపాడే వాడు వీరుడు. ఇప్పుడు అడవులను నరికి భూమిని నాశనం చేసే వాడిని హీరో అంటారు’’ అని పవన్ అన్నారు. తాను కూడా సినిమా ఫీల్డ్‌లో భాగమేనని, ఇలాంటి సినిమాలు తీయడానికి తరచూ కష్టపడుతున్నానని, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని పవన్ ప్రశ్నించారు.

పవన్ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసారని బన్నీ ఫ్యాన్స్ పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కొద్దీ రోజుల పాటు ఈ వార్ కొనసాగింది. ఆ తర్వాత చల్లారింది. ఇటీవల మరోసారి అల్లు అర్జున్ ఓ సినిమా ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ మరోసారి చర్చకు దారితీసాయి. దీనిపై కూడా అభిమానులు, జనసేన నేతలు స్పందించడం..బన్నీ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా ఈ వార్ మధ్య పవన్ కు బర్త్ డే విషెష్ తెలుపుతారో లేదో బన్నీ అని అంత మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు బన్నీ విషెష్ తెలుపడం తో వార్ కాస్త చల్లారినట్లే అని మాట్లాడుకుంటున్నారు.

Read Also : CM Revanth Reddy : మరికాసేపట్లో ఖమ్మం కు సీఎం రేవంత్ రెడ్డి