Site icon HashtagU Telugu

Mega 157 : మెగాస్టార్ తో బుల్లిరాజు..థియేటర్లలో నవ్వులు మాములుగా ఉండవు !!

Bulliraju Chiru

Bulliraju Chiru

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి (Chiranjeevi – Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా Mega 157 టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ లో సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు (Bulliraju) కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ లో తనదైన మాట తీరుతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించి వారి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బుల్లిరాజు ఇప్పుడు మెగా స్టార్ మూవీ లో నటిస్తున్నాడు. తాజాగా చిరంజీవి – బుల్లిరాజు కలిసి నవ్వుతూ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది.

Guava: మీకు జామ పండ్లు ఇష్టమా? కానీ మీకు ఈ వ్యాధి ఉంటే వాటిని తినకండి.!

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులపై బిగ్ డీల్ కుదిరినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్ల మధ్య డీల్‌లో సొంతం చేసుకున్నట్లు సమాచారం. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరొలియో సంగీతాన్ని అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. చిరు-నయనతార కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇప్పటికే వీరిద్దరూ ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణెదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత చిరు ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.