Bro Final Collections : నిర్మాత కు ఎన్ని కోట్లు బొక్క అంటే…

'బ్రో' వల్ల నిర్మాత విశ్వప్రసాద్ కు రూ. 31.10 కోట్లు నష్టాలు

Published By: HashtagU Telugu Desk
Bro Final collections

Bro Final collections

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో (BRO) మూవీ ఫైనల్ కలెక్షన్స్ వచ్చేసాయి. అంత భావించినట్లే నిర్మాత విశ్వప్రసాద్ కు భారీ నష్టమే వాటిల్లింది. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్షన్లో త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందించిన చిత్రం బ్రో. గత నెల 28 న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ , కలెక్షన్లు మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. మొదటి మూడు రోజులు పర్వాలేదు అనిపించినా , తర్వాత నుండి భారీగా పడిపోతూ వచ్చాయి. నిన్నటితో ఈ మూవీ ఫైనల్ కలెక్షన్లు వచ్చేసాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే..

నైజాంలో రూ. 20.90 కోట్లు
సీడెడ్‌లో రూ. 6.95 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 6.93 కోట్లు
ఈస్ట్ గోదావరిలో రూ. 4.87 కోట్లు
వెస్ట్ గోదావరిలో రూ. 4.39 కోట్లు
గుంటూరులో రూ. 4.54 కోట్లు
కృష్ణాలో రూ. 3.51 కోట్లు
నెల్లూరులో రూ. 1.78 కోట్లతో కలిపి.. రూ. 53.87 కోట్లు షేర్, రూ. 85.20 కోట్లు గ్రాస్ రాబట్టింది.

అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.28 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.40 కోట్లు షేర్‌, రూ. 113.30 కోట్లు గ్రాస్ సాధించింది. ఈ మూవీ వల్ల నిర్మాత కు మొత్తంగా రూ. 31.10 కోట్లు మేర నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది.

ఇక పవన్ (Pawan Kalyan) రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ తాజాగా బ్రో మూవీస్ చేసాడు. ఈ మూడు సినిమాల్లో ఏది కూడా లాభాలు అందుకోలేకపోయాయి. ‘వకీల్ సాబ్’ సినిమా వల్ల నిర్మాత దిల్ రాజు కు రూ. 3.64 కోట్లు నష్టం వచ్చింది. ఆ తర్వాత ‘భీమ్లా నాయక్’ వల్ల నిర్మాత నాగ వంశీ కి రూ. 10.37 కోట్లు నష్టం వచ్చింది. ఇప్పుడు ‘బ్రో’ వల్ల నిర్మాత విశ్వప్రసాద్ కు రూ. 31.10 కోట్లు నష్టాలు వచ్చాయి. ఓవరాల్ గా మూడు రీమేక్ ల వల్ల భారీగా లాస్ వచ్చాయి.

Read Also : Bhola Shankar Collections : భోళా శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ..దుమ్ములేపాయి

  Last Updated: 12 Aug 2023, 11:15 AM IST