Movie Collections: కేజీఫ్ 2, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర.. వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దర్శక నిర్మాతలో కూడా వారి సినిమాలను పాన్

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 08:53 PM IST

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దర్శక నిర్మాతలో కూడా వారి సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటించి వారికి క్రేజ్ ని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో విడుదలైన పాన్ ఇండియా సినిమాల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, బ్రహ్మాస్త్ర సినిమాలు విడుదల అయ్యే బాక్సాఫీస్ వద్ద కోట్లలో కలెక్షన్స్ ని సాధించాయి.

మరి ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వీకెండ్ లో ఏ రేంజ్ లో కలెక్షన్స్ ను సాధించాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం తో పాటుగా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించింది. ఇక వీకెండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే..281.17 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ పరంగా 496 కోట్ల గ్రాస్ ను
అందుకుని సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కన్నడ హీరో యష్ హీరోగా నటించిన కేజిఎఫ్ చాప్టర్ 2 వీకెన్ కలెక్షన్ విషయానికి వస్తే.. 215.92 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

ఇక గ్రాస్ పరంగా 430.20 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక ఇటీవలే విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా కూడా వీకెండ్ కలెక్షన్స్ 2 కోట్ల మార్క్ ని అధిగమించి 2.19 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక అన్ని వర్షన్స్ తో కలిపి సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 19.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల వర్త్ బిజినెస్ 5 కోట్లు కాగా 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 2.99 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.