Boycott Pushpa 2 అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1 సూపర్ హిట్ కాగా ఆ సినిమా సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 మీద భారీ హైప్ ఏర్పడింది. పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పుష్ప 2 (Pushpa 2) కోసం ఫ్యాన్స్ అంతా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. డిసెంబర్ 5న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఐతే అంతా బాగుంది అనుకుంటున్న టైం లో పుష్ప 2 సినిమాను బాయ్ కాట్ చేయాలని అంటున్నారు కన్నడ ఆడియన్స్.
అసలు కన్నడ ఫ్యాన్స్ ఎందుకు పుష్ప 2 ని బాయ్ కాట్ చేయాలి అనుకుంటున్నారు అంటే. రీసెంట్ గా దీపావళికి కన్నడ నుంచి బఘీర సినిమా రిలీజైంది. ఈ సినిమాకు తెలుగులో ఎక్కువ థియేటర్స్ ఇవ్వలేదు. దీవాళికి బఘీర (Bagheera)తో రిలీజైన మిగతా 3 సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోగా బఘీరాని ఎవరు పట్టించుకోలేదు. అందువల్ల బఘీరకు షోలు తగ్గిస్తున్నారు.
పుష్ప 2 మీద రివెంజ్..
ఈ విషయం తెలుసుకున్న కన్నడ ఫ్యాన్స్ రాబోయే పుష్ప 2 మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో బాయ్ కాట్ పుష్ప 2 సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు. బఘీర సినిమాకు ప్రశాంత్ నీల్ కథ అందించగా శ్రీమురళి లీడ్ రోల్ లో నటించారు. హోంబలె బ్యానర్ నిర్మించిన ఈ సినిమాను సూరి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది.
ఐతే కన్నడ సినిమాలు ఎన్నో తెలుగులో మంచి సక్సెస్ సాధించాయి. కానీ బఘీర విషయంలో ఆడియన్స్ రిజల్ట్ ని రెస్పెక్ట్ చేయాలి కానీ ఇలా ఒక సినిమా ఇంపాక్ట్ మరో సినిమా మీద చూపించకూడదని కొందరు చెబుతున్నారు.
Also Read : Rana : జై హనుమాన్ లో రానా కూడానా.. ప్రశాంత్ వర్మ సూపర్ ప్లానింగ్..!