అభిమానులందు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేరేయా..వారితో ఎలాంటి గొడవలు పెట్టుకోడదాయా..పెట్టుకొని నష్టపోకండయా..అని చాలామంది పద్యాల రూపంలో మాట్లాడుకోవడం..కామెంట్స్ చేయడం చేస్తుంటారు. అందుకే ఎవరు కూడా పవన్ అభిమానుల జోలికి వెళ్లారు..టైం చూసుకొని పవన్ ఫ్యాన్స్ పగ తీర్చుకుంటారని అంత భావిస్తారు. అలాంటి పవన్ అభిమానుల్లో ఆగ్రహం తెప్పించారు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ (Allu Arjun) ..ఏపీ ఎన్నికల నేపథ్యంలో తన స్నేహితుడు నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి (Shilpa Ravichandra kishore Reddy ) కి మద్దతు పలికారు. ఇదే ఆయన చేసిన పెద్ద తప్పు అని పవన్ అభిమానులు అంటున్నారు. ఓ పక్క తన మేనమామ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా వైసీపీ ని గద్దె దించాలని ఎన్ని అవమానాలు ఎదురుకుంటూ..సినిమాలు పక్కన పడేసి..సొంత డబ్బులను ప్రజల కోసం ఖర్చు చేస్తూ..ఎన్నికల్లో జనసేన పార్టీ ని గెలిపించాలని కష్టపడుతుంటే..దానిని పక్కన పెట్టి ప్రత్యర్థి అభ్యర్థి కోసం అల్లు అర్జున్ వెళ్లడాన్ని తప్పుపడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దీనిపై నాగబాబు సైతం పరోక్షంగా అల్లు అర్జున్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే…!’ అని ట్వీట్ చేసాడు. ఇక మెగా ఫ్యాన్స్ సైతం స్నేహితుడికి ఇచ్చిన విలువ మామయ్యకు ఇవ్వలేకపోయాడా? అంటూ భగ్గుమంటున్నారు. గతంలో ఓ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ గురించి చెప్పాలంటూ అభిమానులు గొడవ చేస్తుంటే చెప్పను బ్రదర్ అని బన్నీ అన్నాడు. అప్పటి నుండి బన్నీ ఫై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం తో ఉన్నారు. చెప్పను బ్రదర్ అని చిన్న మాటకే పవన్ కళ్యాణ్ అభిమానులు.. దువ్వాడ జగన్నాథం టీజర్ కు 24 గంటల వ్యవధిలో రెండు లక్షలకు పైగా డిస్ లైక్స్ కొట్టారు. ఆ సినిమాకు కలెక్షన్లు కూడా రాలేదు. ఫ్లాప్ అయింది.
ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ను కాదని చెప్పి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపే సరికి అభిమానులు మండిపోతున్నారు. పుష్ప 2 ఫై మన ప్రతాపాపం చూపించాలని అనుకుంటున్నారట. ఆగస్టు 15 న విడుదల కాబోతున్న పుష్ప 2 ను ఏపీ, తెలంగాణలోని పవన్ కల్యాణ్ అభిమానులంతా బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి విజయవాడలో సమావేశమైన పవర్ స్టార్ అభిమానులు చర్చలు జరుపుతున్నారు. అల్లు అర్జున్ మనకు మద్దతుగా లేనప్పుడు అతని సినిమాలకు మనం మాత్రం మద్దతివ్వడం ఎందుకని వ్యాఖ్యానిస్తున్నారు. సినిమాకు కలెక్షన్లు కావాలంటే వైసీపీ అభ్యర్థికి మద్దుతిచ్చాడు కాబట్టి ఆ పార్టీవారితోనే గతంలో వచ్చినన్ని కలెక్షన్లు తెప్పించుకోవాలంటూ సవాల్ చేస్తున్నారు. మరి ఈ కోపం ఏమైనా అప్పటివరకు చల్లారుతుందా..? లేదా అనేది చూడాలి.
Read Also : Sitting For Long Hours: ఓరీ నాయనో.. ఎక్కువసేపు కూర్చోవడం కూడా నష్టమేనా..?