Site icon HashtagU Telugu

BoyapatiRAPO: అప్ డేట్ అదిరింది, బోయపాటి-రామ్ మాస్ సినిమా పేరు ‘స్కంధ’

Skanda

Skanda

మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచే భారీ అంచనాలు రేపుతోంది. ఒకవైపు మాస్ డైరెక్టర్ కావడం, మరోవైపు ఎనర్జిటిక్ నటిస్తుండటంతో ఈ మూవీకి మంచి బజ్ ఉంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా సయీ మంజ్రేకర్ ఓ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ వైరల్ అయింది. రామ్ లుక్ మార్చేసి మరింత మాస్ గా తయారయ్యాడు ఈ సినిమా కోసం.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ జరిగినట్టు ప్రకటించి, సినిమాని 15 సెప్టెంబర్ 2023న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రకటించి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

బోయపాటి రామ్ మాస్ సినిమాకు ‘స్కంధ’ అనే టైటిల్ ని ప్రకటించారు. కింద సబ్ టైటిల్ ది అటాకర్ అని ఇచ్చారు. స్కంధ అంటే కుమారస్వామి అని అర్ధం వస్తుంది. కుమారస్వామి దేవతలకు సైన్యాధిపతిగా ఉండి యుద్ధాలను గెలిపిస్తాడు అని పురాణాల్లో ఉంటుంది. మొదటిసారి హీరో రామ్ బోయపాటి డైరెక్షన్ లో నటిస్తుండటంతో అభిమానులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Age of Consent: 16 ఏళ్లకే అమ్మాయిలు శృంగారం చేసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు

Exit mobile version