Site icon HashtagU Telugu

Allu Arjun And Boyapati: సరైనోడు కాంబో రిపీట్

Allu Arjun And Boyapati

Allu Arjun And Boyapati

Allu Arjun And Boyapati: మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుతో సూర్య ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ కాంబో ఫిక్స‌యిన‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే సూర్య, బోయ‌పాటి సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జరుగుతుంది. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్- బోయపాటి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బన్నీతో సినిమా చేయడం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ రెడీగా ఉన్నారు. అలాగే ఓ బాలీవుడ్ డైరెక్టర్ కూడా బన్నీతో సినిమా చేయాలి అనుకుంటున్నారు. వీళ్లతో పాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా బన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వీళ్లిద్దరిది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఇద్దరూ కలిసి సరైనోడు అనే సినిమా చేశారు. ఆ సినిమా అప్పట్లో బన్నీ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది.

అప్పటి నుంచి వీళ్లిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఇటీవల బన్నీకి బోయపాటి కథ చెప్పారట. కథ విని బోయపాటి ఓకే చెప్పారట.

ఈ క్రేజీ కాంబో మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్యతో బోయపాటి ఎన్నికల ముందే ఓ సినిమా చేయాలి అనుకున్నారు. అయితే.. స్కంధ మూవీ బిజీలో ఉండడం వలన ఆ తర్వాత చేస్తానని చెప్పడంతో బాలయ్య.. బాబీతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు.

బాలయ్య కూడా చాలా మంది దర్శకులకు మాట ఇచ్చారు. పైగా సింహా, లెజెండ్, అఖండ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కలిసి సినిమా చేస్తే.. అంచనాలు భారీగా ఉంటాయి. అందుచేత బోయపాటి బాలయ్యతో సినిమా విషయంలో కంగారు పడడం లేదట. ఎవరి ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. ఆ అంచనాలకు మించి ఉందనేలా తీయాలి అనుకుంటున్నారట. అయితే.. బన్నీకి బోయపాటి చెప్పిన కథ నచ్చింది. పుష్ప 2 తర్వాత ఈ కాంబో ఉంటుందా లేక ఇద్దరు చెరో ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఈ కాంబో ఉంటుందా చూడాలి.

Also Read: Prabhas and Trivikram: ప్రభాస్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ త్రివిక్రమ్ తో సంప్రదింపులు

Exit mobile version