Site icon HashtagU Telugu

Prabhas Record: బాక్సాఫీస్ కింగ్ ఫ్రభాస్, 1979 స్క్రీన్ల‌లో సలార్ రిలీజ్!

Pan India Star Prabhas

Prabhas

ఇండియన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి. లోకల్ టు గ్లోబల్ అంటూ వివిధ ప్రపంచ దేశాల్లో సత్తా చాటుతున్నాయి. జపాన్, నేపాల్, యూఎస్ లాంటి దేశాల్లో మన తెలుగు సినిమాలు ఊహించని విధంగా కలెక్షన్లను సాధిస్తున్నాయి. బాహుబ‌లి-2, ఆర్ఆర్ఆర్, ప‌ఠాన్ లాంటి సినిమాలు వెయ్యికి పైగా స్క్రీన్ల‌లో రిలీజవ‌డంతో హాలీవుడ్ సినిమాల స్థాయిలో సంద‌డి క‌నిపించింది.

అయితే ఇప్ప‌టిదాకా రిలీజ్ ప‌రంగా ఉన్న రికార్డుల‌న్నింటినీ కూడా ప్ర‌భాస్ కొత్త చిత్రం స‌లార్ కొట్టేయ‌బోతోంది. ఈ సినిమాను ఏకంగా 1979+ స్క్రీన్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగానే ప్ర‌క‌టించ‌డం విశేషం. ప్ర‌త్యంగిర సినిమాస్ స‌లార్ సినిమా ఉత్త‌ర అమెరికా హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది. ఆ సంస్థ ఏకంగా 1979+ స్క్రీన్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు అఫీషియ‌ల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇండియ‌న్ సినిమాల్లో ఇది బిగ్గెస్ట్ ఎవ‌ర్ రిలీజ్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. గ‌త రికార్డు కంటే 400-500 దాకా స్క్రీన్లు ఎక్కువే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు.

అయితే తాజాగా USA లో ప్రభాస్ రేంజ్ తెలిసేలా భారీ కార్ ర్యాలీ చేపట్టారు ఆయన అభిమానులు. ప్రాజెక్ట్ K టీ షర్ట్స్ ధరించి US రోడ్లపై రయ్ రయ్ అంటూ స్పీడు పెంచారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటే అంటూ ఈ వీడియో చూసి ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు.

Also Read: Telangana High Court: కేసీఆర్ కు షాక్.. బీఆర్ఎస్ కు హైకోర్టు నోటీసులు