Site icon HashtagU Telugu

NBK108 Update: బాలయ్య కోసం బాలీవుడ్ విలన్.. క్రేజీ అప్‌డేట్ ఇదిగో!

Nbk108

Nbk108

ఒకరు మాస్ లో (Mass) ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరో, మరొకరు కమర్షియల్ చిత్రాలను తనదైన స్టైయిల్ లో తెరకెక్కించడంలో సిద్ధహస్తడు (Director). అలాంటి క్రేజీ కాంబినేషన్  లో సినిమా రూపుదిద్దుకుంటుందంటే భారీ అంచనాలు ఏర్పడటం ఖాయమే. దర్శకుడు అనిల్ రావిపుడితో నందమూరి బాలకృష్ణ NBK108 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై అటు ప్రేక్షకుల్లోను, ఇటు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

బాలీవుడ్ (Bollwood) నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది టాలీవుడ్‌లో ఆయనకు మొదటి సినిమా అవుతుంది. ఈ మేరకు మేకర్స్ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అర్జున్ రాంపాల్ సెట్స్‌లో అడుగు పెట్టె ముందు బాలకృష్ణ పాపులర్ డైలాగ్‌ ‘ఫ్లూట్ జింక ముందు ఊద..సింహం ముందర కాదు’ చెప్పి ఆశ్చర్యపర్చాడు. బాలకృష్ణ, అనిల్ రావిపుడి మూవీ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ద్రుష్టిని కూడా ఆకర్షిస్తోంది.

అర్జున్ రాంపాల్ ట్విట్టర్‌లో ఇలా రియాక్ట్ అయ్యాడు “NBK108 టీమ్‌తో నా సౌత్ అరంగేట్రం చేస్తున్నాను. చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇదంతా సరదాగా సాగిపోతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు’’. కాగా ఈ నటుడు పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ సినిమాతో సౌత్ అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ తెలియని కారణాల వల్ల అది జరగలేదు. అతని స్థానంలో బాబీ డియోల్ తీసుకున్నారు. ఇప్పుడు బాలయ్య మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు.

Also Read: Sudha Murthy Voted: ఓటేసిన సుధామూర్తి, ఓటుహక్కుపై యువతకు సందేశం!