Kareena Kapoor: ఆ రాత్రులను అస్సలు మర్చిపోలేను.. సంచలన వాఖ్యలు చేసిన కరీనా కపూర్!

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 12:56 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. ఈ వయసులో కూడా ఈమె అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది కరీనా. దాదాపు 20 ఏళ్ళుగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆల్మోస్ట్ బాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది కరీనా. కాగా ఈమె బాలీవుడ్ స్టార్ హీరో అయిన సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లల తరువాత కూడా ఆమె ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. వరుస సినిమాలు అటు కమర్షియల్ ఆడ్స్ ద్వారా కూడా కోట్లు గడిస్తోంది ఈ బ్యూటీ. అంతే కాదు బయట బిజినెస్ లు కూడా చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది. ఇంత బిజీగా ఉన్నా.. ఆమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇటు సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా కూడా ఆమెకు ఇన్ కమ్ వస్తుండటంతో ఫ్యాషన్ ను ఫాలో అవుతూ ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్సులు వేస్తూ ఇన్ స్టాలో తెగ సందడి చేస్తుంది బ్యూటీ.

అంతే కాదు ఎప్పుడూ ఏదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతూ ఉంటుంది సీనియర్ బ్యూటీ. కాంట్రవర్సీయల్ కామెంట్స్, కాస్ట్లీ వస్తువుల కొనడం దగ్గర నుంచి ఆమె లగ్జరీలైఫ్ కు సబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరలు అవుతూ ఉంటాయి. ఆమె పిల్లల కేరింగ్ తీసుకునే ఆయాల జీతం, ఆమె వాడే బ్యాగ్ ల కాస్ట్ ఇలా ఎన్నో విషయాల్లో వార్తల్లో నిలిచింది కరీనా. తాజాగా మరోసారి ఆమె హాట్ న్యూస్ అయ్యింది. ఇక ది క్రూ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తను తన ఎంటైర్ కెరియర్ లో చాలా ఒడిదోడుకులు ఎదుర్కొన్నట్టు తెలిపింది కరీనా కపూర్. తను ఎన్నో కష్టాలను కూడా అనుభవించినట్టుగా చెప్పింది. ఇక జబ్ వి మెట్ సినిమాకి ముందు తను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా వెల్లడించింది. అంతేకాదు నా కెరియర్ డల్ అయ్యి.. ఎటు పోతుందో తెలియని పరిస్థితిలో ఉండేది. అది తలుచుకుని నేను ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను అని తెలిపింది కరీనా. ఆ తరువాత ప్లాన్ చేసుకుని తన లైఫ్ ను సెట్ చేసుకున్నట్టు ఆమె పేర్కొంది. ఇక ఈ విషయంలో తనకు ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలుస్తున్నారు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.