Sundeep Kishan : యువ హీరో సందీప్ కిషన్ తనకు జరిగిన మోసాన్ని గురించి లేటెస్ట్ గా మీడియాతో పంచుకున్నారు. తెలుగులో సోలో హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న సందీప్ కిషన్ (Sundeep Kishan) తమిళ్ లో స్పెషల్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ధనుష్ సినిమాల్లో సందీప్ కిషన్ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. ఐతే సందీప్ కిషన్ బాలీవుడ్ ఎందుకు వెళ్లట్లేదు. మల్టీటాలెంటెడ్ అయిన సందీప్ కిషన్ కు హిందీ పరిశ్రమ నుంచి ఆఫర్లు రావట్లేదా అంటే తనకు సినిమాలు చేయాలని ఉన్నా అక్కడ ఆఫర్లు రావడం లేదని అన్నారు.
సందీప్ కిషన్ హిందీలో షోర్ ఇన్ ద సిటీ సినిమా చేశాడు. ఐతే అంతకుముందే తనకు బాలీవుడ్ (Bollywood) బడా ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్లు వచ్చాయి. ఐతే వాటికి తను ఓకే చెప్పిన తర్వాత తనకు తెలియకుండానే ఆ ప్రాజెక్ట్ లు వేరే వాళ్లతో స్టార్ట్ చేశారు. ఆ టైం లో చాలా బాధ అనిపించినా తర్వాత ఇక్కడ ఇంతే అనుకున్నానని అన్నారు సందీప్ కిషన్.
ఇలాంటివి చాలా కామన్..
అందుకే తాను దక్షిణాది సినిమాలనే చేస్తున్నానని.. బాలీవుడ్ అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్తున్నాయని అన్నారు సందీప్ కిషన్. ఐతే ఏ పరిశ్రమ అయినా ఇలాంటివి చాలా కామన్ కాకపోతే సందీప్ కిషన్ ఎక్స్ పీరియన్స్ చేయడం కొత్త కాబట్టి అతను ఫీల్ అవుతున్నాడని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ ఊరుపేరు భైరవకోన సినిమాతో సక్సెస్ అందుకున్న సందీప్ కిషన్ ప్రస్తుతం మజాకా సినిమా చేస్తున్నాడు.
ధనుష్ (Dhanush) తో రాయన్ సినిమా చేసిన సందీప్ కిషన్ ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకున్నాడు. సందీప్ కిషన్ కు తెలుగు, తమిళ్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.
Also Read : Venkatesh : వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బిజినెస్ లెక్కలివే..!