Bollywood Bodyguards: కోట్లలో జీతాలు అందుకుంటున్న బాలీవుడ్ బాడీగార్డ్స్

సెలబ్రిటీలకు వ్యక్తిగత భద్రత చాలా అవసరం. సినిమా పరిశ్రమ కల్పించే బాడీ గార్డ్స్ కేవలం ఈవెంట్స్ లలో మాత్రమే రక్షణ కల్పిస్తారు.

Published By: HashtagU Telugu Desk
Bollywood

New Web Story Copy 2023 07 13t171940.201

Bollywood Bodyguards: సెలబ్రిటీలకు వ్యక్తిగత భద్రత చాలా అవసరం. సినిమా పరిశ్రమ కల్పించే బాడీ గార్డ్స్ కేవలం ఈవెంట్స్ లలో మాత్రమే రక్షణ కల్పిస్తారు. కానీ వ్యక్తిగత బాడీగార్డ్స్ నిత్యం వారి వెంట ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఇతర హీరోయిన్స్ బయటకు వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే వ్యక్తిగత బాడీగార్డ్స్ కి సాలరీ ఎంత ఉంటుందో చూద్దాం.

1. సెలబ్రిటీ బాడీగార్డ్‌లలో షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ రవి సింగ్ అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్నాడు. షారుఖ్ ఖాన్ తన బాడీగార్డ్ రవి సింగ్ కు సంవత్సరానికి 2.7 కోట్లు ఇస్తున్నాడట. అంటే నెలకు దాదాపు 17 లక్షలు.

2. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ దాదాపు 29 సంవత్సరాలుగా తన వెంటే ఉంటున్నాడు. అతని పేరు షేరా. షేరా నెలవారీ జీతం దాదాపు రూ. 15 లక్షలు. సంవత్సరానికి 2 కోట్లు.

3. అక్షయ్ కుమార్ బాడీగార్డ్ అయిన శ్రేయ్‌సే తేలే 24 గంటలూ రక్షణ కల్పిస్తాడు. అక్షయ్ కుమార్ తన బాడీగార్డ్ కి సంవత్సరానికి 1.2 కోట్లు ఇస్తున్నాడట.

4. అమితాబ్ బచ్చన్ కు ముంబై పోలీసు కానిస్టేబుల్ జితేంద్ర షిండే బాడీగార్డ్ గా ఉండేవాడు. ఆగస్టు 2021 వరకు తనకు భద్రతకల్పించాడు. అమితాబ్ బచ్చన్ బాడీగార్డ్‌గా ఏడాదికి 1.5 కోట్లు ఇచ్చేవాడట. అయితే అతని ప్రవర్తన నచ్చక 2022లో అమితాబ్ అతని బాడీగార్డ్ ని మార్చేశాడు.

5. అమీర్ ఖాన్ బాడీగార్డ్ యువరాజ్ ఘోర్పడేకి సంవత్సరానికి 2 కోట్లు ఇస్తున్నాడు.

6. హీరోయిన్ దీపికా పదుకొనే తన వ్యక్తిగత బాడీగార్డ్ జలాల్‌కి 1.2 కోట్లు వెచ్చిస్తుందట.

7. అనుష్క శర్మకు ప్రకాష్ సింగ్ వ్యక్తిగత బాడీగార్డ్ గా ఉన్నాడు. ప్రస్తుతం అతను కోహ్లీ, అనుష్క, కుమార్తె వామికకు కూడా వ్యక్తిగత రక్షణ కల్పిస్తున్నాడు. అతని సేవలకు సంవత్సరానికి 1.2 కోట్లు వెచ్చిస్తున్నారట.

Read More: Bengaluru: సీఈఓ,ఎండీ జంట హత్యలు.. కలకలం రేపుతున్న వీడియో?

  Last Updated: 13 Jul 2023, 05:20 PM IST