బాలీవుడ్ హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ (Jhanvi Kapoor) సో స్పెషల్. ఒకవైపు స్టోరీ ఒరియేంటేడ్ మూవీస్ చేస్తూనే, మరోవైపు అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటోంది. అయితే జాన్వీ (Jhanvi Kapoor) మూవీస్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, మరోవైపు ఫిట్ నెస్ కు అంతకంటే ప్రాధాన్యం ఇస్తోంది. జాన్వీ బాడీ ఫిజిక్, స్కిన్ కలర్, వ్యాయామాల గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తి ప్రతిఒక్కరికీ ఉంటుంది. త్వరలో న్యూ ఇయర్ రాబోతుండటంతో మరిన్ని ఫిట్ నెస్ (Fitness) గోల్స్ పెట్టుకుంది. అందుకోసం తాను ఏం చేయబోతుందో, ఏం చేస్తుందో టిప్స్ కూడా చెప్పేసింది. అవేంటో తెలుసుకోండి మరి
“పంజాబీ కుటుంబం నుండి వచ్చిన నేను ఒకప్పుడు బొద్దుగా ఉండేదాన్ని. బొద్దుగా ఉండటంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా. అయితే చిన్న చిన్న మార్పులతో ఫిట్ నెస్ ప్రయాణం మొదలుపెట్టాను. హెల్దీ డైట్ లో పాటించాల్సినది మొదట ఆహారపు అలవాట్లు. ప్రతిరోజు తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటూ రోజువారీ దినచర్య ను మొదలుపెడ్తాను. ఆహారపు అలవాట్లలో భాగంగా జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాను. ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండటం హెల్దీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి.
“నాకు, బ్రౌన్ బ్రెడ్, ఓట్స్, ఎగ్ వైట్ లాంటివి నా ఫేవరెట్. పీనట్ బటర్ వంటి ప్రోటీన్-ప్యాక్డ్ బ్రేక్‌ఫాస్ట్ నాకు చాలా ఇష్టం. మధ్యాహ్న భోజనం కోసం ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తీసుకుంటాను. ఒక్కోసారి పండ్లు, కూరగాయల జ్యూస్ తీసుకుంటాను. ఇక రాత్రి మాత్రం కేవలం తేలికపాటి భోజనం తీసుకుంటా. ఉడికించిన కూరగాయలు, సూప్, కొన్నిసార్లు కాల్చిన చేప’’ ఇదే డైట్ అని చెప్పింది జాన్వీ (Jhanvi Kapoor).
శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరమని జాన్వి అంటోంది. “మీకు ఇష్టమైన వర్కౌట్స్ ఏదైనా ఒకటి కచ్చితంగా చేయాలి. నేను మాత్రం వ్యక్తిగతంగా కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, పైలేట్స్, స్విమ్మింగ్, యోగా, డ్యాన్స్ (Fitness) కూడా ఆస్వాదిస్తాను. యోగా నా మనసుకు విశ్రాంతినిస్తుంది కాబట్టి రెగ్యులర్ గా చేస్తాను. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ పోషక పదార్ధాలను తీసుకోవాలని గుర్తుంచుకోండి. విటమిన్లు ఎ, సి, ఇ, జింక్‌లో అధికంగా ఉండే ఈ సూపర్ పదార్థాలు తీసుకుంటాం. ప్రతిరోజూ నడక, జాగింగ్, ఇంట్లో వ్యాయామాలు మొదలైన సాధారణ వ్యాయామాలను కచ్చితంగా చేయాలి. పట్టుదలతో ఉంటే ఏదైనా సాధ్యమే’’ అని అంటోంది జాన్వీ(Jhanvi Kapoor).
Also Read: Ravi Teja First look Teaser: మెగా ‘మాస్’ యాక్షన్.. ఏసీపీగా రవితేజ అదుర్స్!