Pooja Bedi : ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ పూజా బేడీ గతంలో పలు హిట్ సినిమాల్లో నటించి ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ టీవీ షోలు చేస్తుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు కబీర్ బేడీ కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ తక్కువ సినిమాలతోనే కెరీర్ ని లాక్కొచ్చేసింది. ప్రస్తుతం పూజ బేడీ లైఫ్ స్టైల్ కి సంబంధించిన వీడియోలు కూడా చేస్తూ సోషల్ మీడియాలో బిజీగానే ఉంది. ఆమె కూతురు అలయ కూడా ఇప్పుడు హీరోయిన్ గా చేస్తుంది.
తాజాగా పూజ బేడీ ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కూతురు నటన గురించి, తన కూతురు గురించి పొగిడింది. ఈ క్రమంలో తన నటన గురించి పూజ బేడీ మాట్లాడుతూ.. నేను మంచి నటిని కాదు. నాకు నటన రాదు. అందుకే నేను ప్రేక్షకులను నా నటన నుంచి డైవర్ట్ చేయడానికి నా క్లీవేజ్ చూపించేదాన్ని అని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అయితే పలువురు నెటిజన్లు ఈ కామెంట్లపై స్పందిస్తూ.. ఇటీవల కొందరు హీరోయిన్స్ అదే చేస్తున్నారు. నటన రాకపోయినా అందాలు ఆరబోస్తూ ఛాన్సులు తెచ్చుకుంటూ గడిపేస్తున్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఒక నటి ఇలా ఒప్పుకోవడం మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు.
Also Read : Vijay Deverakonda : VD12 షూటింగ్ లో విజయ్ దేవరకొండకు గాయం.. అయినా షూట్ కంటిన్యూ చేస్తున్న విజయ్..