Mrunal Thakur : జిమ్‌ వర్క్ అవుట్స్‌ని కూడా.. మృణాల్ ఎంత క్యూట్‌గా చేస్తుందో చూశారా..?

జిమ్‌ వర్క్ అవుట్స్‌ని కూడా మృణాల్ ఎంత క్యూట్ గా చేస్తుందో చూశారా..? వైరల్ అవుతున్న వీడియో..

Published By: HashtagU Telugu Desk
Bollywood Actress Mrunal Thakur Cute Gym Work Out Video Gone Viral

Bollywood Actress Mrunal Thakur Cute Gym Work Out Video Gone Viral

Mrunal Thakur : బాలీవుడ్ భామలు అంతా ఎక్కువ సమయం జిమ్ లో గడుపుతుంటారు. కొందరు భామలు అందంగా కనిపించడం కోసం ఇష్టపడి కసరత్తులు చేస్తూ కష్టపడుతుంటారు. కానీ కొంతమంది భామలు మాత్రం ఇష్టంలేకున్నా, సినిమాల కోసం బాడీని ఫిట్ గా ఉంచుకోవడం కోసం కష్టంతో జిమ్ లో కసరత్తులు చేస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే.. మృణాల్ ఈ సెకండ్ క్యాటగిరీకి చెందిన హీరోయిన్ లా కనిపిస్తున్నారు.

మృణాల్ ఠాకూర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో రీసెంట్ గా ఓ జిమ్ వీడియోని షేర్ చేసారు. ఆ వీడియోలో మృణాల్ జిమ్ లో వర్క్ అవుట్స్ చేయలేక, బద్ధకంతో అద్దం ముందు నిలబడి క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ టైం పాస్ చేస్తున్నారు. అయితే జిమ్ ట్రైనర్ తన వద్దకి రాగానే మాత్రం.. వర్క్ అవుట్స్ చేస్తున్నట్లు నటించి తన ట్రైనర్ ని మోసం చేస్తున్నారు. ఈ ఫన్నీ చీటింగ్ వీడియో చూడడానికి చాలా సరదాగా ఉంది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అంతా మృణాల్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ కి ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియో మరికొంచెం ఉంటే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం.. మృణాల్ లో తమని తాము చూసుకుంటున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మృణాల్ సినిమాలు విషయానికి వస్తే.. తెలుగులో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మృణాల్ కి ఫ్యామిలీ స్టార్ తో మొదటిసారి ఫెయిల్యూర్ ఎదురైంది. సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి టాక్ వచ్చినప్పటికీ.. కమర్షియల్ గా వర్క్ అవుట్ లేదు. దీంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయ్యింది. కాగా ఈ మూవీ మే 3 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంది.

Also read : Nabha Natesh : నటుడు ప్రియదర్శి పై కేసు పెడతానంటున్న నభా నటేష్.. అసలేమైంది..?

  Last Updated: 18 Apr 2024, 04:30 PM IST