Aamir Khans Marriage : చాలామంది అస్సలు పెళ్లిళ్లు కాక బాధపడుతుంటే.. అమీర్ ఖాన్ మాత్రం జోరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అమీర్, ఇక మూడో పెళ్లికి రెడీ అవుతున్నాడట. ఆయన మొదటి భార్య రీనా దత్తా. రీనాతో అమీర్ ఖాన్‌కు 1986లో పెళ్లి జరిగింది. వీరి పిల్లల పేర్లు జునైద్ ఖాన్, ఐరా ఖాన్. 2002 సంవత్సరంలో రీనా దత్తా నుంచి అమీర్ విడిపోయారు. ఆ తర్వాత మూవీ డైరెక్టర్ కిరణ్ రావుతో అమీర్ ఖాన్ నాలుగేళ్లు డేటింగ్ చేశారు. తదుపరిగా 2005లో కిరణ్ రావును ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరి కుమారుడి పేరు ఆజాద్ ఖాన్. 2021 సంవత్సరంలో కిరణ్ రావు నుంచి అమీర్ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మరో యువతితో అమీర్ డేటింగ్‌లో ఉన్నారట. ఆ అమ్మాయి బెంగళూరు వాస్తవ్యురాలు అని తెలుస్తోంది. తదుపరిగా అమీర్, సదరు యువతి పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అదే జరిగితే.. అమీర్ గత 40 ఏళ్ల వ్యవధిలో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది.
Also Read :Banks Big Changes : బ్యాంకుల టైమింగ్స్.. ప్రతివారం వర్కింగ్ డేస్.. బిగ్ అప్‌డేట్?
ఫిల్మ్‌ఫేర్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. అమీర్ ఖాన్ కొత్త భాగస్వామి(Aamir Khans Marriage) బెంగళూరు దక్షిణ నగర వాస్తవ్యురాలు. ఆమెను 59 ఏళ్ల అమీర్ తన కుటుంబానికి ఇప్పటికే పరిచయం చేశారట. రియా చక్రవర్తికి చెందిన పోడ్‌కాస్ట్ 2వ ఎపిసోడ్‌లో అమీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మూడో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా వెల్లడించారు. తాను ఒంటరిగా జీవించడానికి ఇష్టపడనని అమీర్ ఖాన్ తేల్చి చెప్పారు. ఇతరులతో సాంగత్యం చేయడం అంటే తనకు ఇష్టమని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావులతో తాను సన్నిహితంగానే ఉంటానని అమీర్ చెప్పుకొచ్చారు. వివాహాల గురించి ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అభిప్రాయం ఉంటుందని ఆయన చెప్పారు.