బిగ్ బాస్ సీజన్ 8 లో ఆదివారం హౌస్ నుంచి నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. ఐతే ఆడియన్స్ ఓటింగ్ తో తనని సేవ్ చేయాలని అనుకున్నా కూడా హౌస్ నుంచి మణికంఠ మాత్రం ఎలిమినేట్ అయ్యాడు. నాగార్జున తనని ఎన్నిసార్లు రీ చెక్ చేసుకోమని అడిగినా అతను సెల్ఫ్ ఎలిమినేట్ కే ఓటు వేశాడు. బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8) లోనే కాదు ఇన్ని సీజన్లలో ఇదే ఒక కంటెస్టెంట్ ఇలా తనకు తాను సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుని బయటకు రావడం ఇదే మొదటిసారి.
ఐతే టాస్కుల్లో తను ఫిజికల్ ఎఫర్ట్ పెట్టలేకపోవడంతో పాటుగా మిగతా కంటెస్టెంట్స్ అంతా తనని తప్పుగా అర్ధం చేసుకోవడాన్ని మణికంఠ (Manikantha) డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఆ కారణాల వల్లే అతను బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది. హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఎంత చెప్పినా సరే మణికంఠ తనతంట తాను బయటకు వచ్చేశాడు.
ఐతే మణికంఠ బయటకు రావడం చివరి దాకా సస్పెన్సే కాబట్టే అతను ఎలిమినేట్ అయ్యాక అతని ఏవీ కూడా వేయలేకపోయారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన మణికంఠ తనకు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన వారికి థాంక్స్ చెప్పాడు. బిగ్ బాస్ సీజన్ 8 లో మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ ఆడియన్స్ కి కూడా షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
బిగ్ బాస్ 8 లో సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీద నాగార్జునకు దగ్గరకు రాగానే ఇప్పుడు చాలా ఫ్రెష్ గా ఉందని అన్నాడు నాగార్జున. హౌస్ లో అతను చాలా స్ట్రెస్ ఫీలైన విషయం తెలిసిందే కానీ హౌస్ నుంచి బయటకు రాగానే హమ్మయ్య అనుకున్నాడు అంటే అతను ఎలిమినేట్ అవ్వడమే అతనికి మంచిదని చెప్పొచ్చు.
Also Read : Malla Reddy : మనవరాలి పెళ్లిలో డాన్స్ ఇరగదీసిన మల్లారెడ్డి