Site icon HashtagU Telugu

Bigg Boss 7 : ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన స్టార్ కంటెస్టెంట్..!

Biggboss 7 Shocking Star Co

Biggboss 7 Shocking Star Co

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఐదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తుంది. ప్రతి సోమవారం నామినేషన్స్ ఎలా ఉంటాయో ప్రతి వీకెండ్ అదే ఆదివారం ఎలిమినేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. ఏదో ఒక వారం అది కూడా ఎపిసోడ్ ని రక్తి కట్టించేందుకు లేదా ఏదైనా పండుగ టైం లో ఈ కంటెస్టెంట్ లేకపోతే ఎంటర్టైన్ మెంట్ మిస్ అవుతాం అనుకుంటే తప్ప ఎలిమినేషన్ ఉండదు.

కానీ బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచి నాలుగు వారాలుగా అది జరగలేదు. ఐదో వారం కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగిందని తెలుస్తుంది. ఈ వారం కూడా హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఈసారి హౌస్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న శుభ శ్రీ (Shubha Sri) హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ లీక్స్ ద్వారా ఆల్రెడీ ఆదివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది ముందే లీక్ అవుతుంది.

Also Read : Rashmika-Ranbir: రణబీర్ తో రష్మిక ఫస్ట్ నైట్.. యానిమల్ మూవీకి హైలైట్ ఇదే!

అలా బిగ్ బాస్ (Bigg Boss 7) నుంచి ఈ వారం శుభ శ్రీ ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. అయితే శుభ శ్రీ ఎలిమినేషన్ తో ఇంకా హౌస్ లో ఇద్దరు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అయితే ఈ వీకెండ్ హౌస్ లోకి మరో ఏడుగురు కొత్త కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపిస్తున్నారని టాక్. మరి వారిలో ఎవరు ఇప్పుడున్న కంటెస్టెంట్స్ కి పోటీ ఇస్తారన్నది చూడాలి.

బిగ్ బాస్ (Bigg Boss ) లో ఇప్పటివరకు ఆటని చూస్తే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, శివాజి, యావర్ బాగా ఆడుతున్నారు. సందీప్ కూడా తన ఎఫర్ట్ పెడుతున్నాడు. అమర్ దీప్ కేవలం మాటలకే తప్ప చేతల్లో చూపించలేకపోతున్నాడు. తేజ కొంతమేరకు ఎంటర్టైన్ చేస్తున్నాడు. గౌతం కృష్ణ ఇంకా స్ట్రాంగ్ అవ్వాల్సి ఉంది. శోభా శెట్టి, ప్రియాంకా తమ సీరియల్ ఇమేజ్ తో నెట్టుకొస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join