Site icon HashtagU Telugu

Bigg Boss 7 : పూజా ఔట్.. రతిక ఇన్..!

Biggboss 7 Pooja Murthy Out Rathika Rose Re Entry

Biggboss 7 Pooja Murthy Out Rathika Rose Re Entry

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ వస్తున్న ఈ సీజన్ లో దసరా స్పెషల్ ఎపిసోడ్ అందరికీ షాక్ ఇస్తూ మరో లేడీ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేశారు. సీజన్ 7 లో ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేట్ అవగా వారిలో ఏడుగురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉండటం విశేషం. బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడో వారం దామిని, నాల్గవ వారం రతిక, ఐదోవారం శుభ శ్రీ, ఆరో వారం నయని పావని ఎలిమినేట్ అయ్యారు. ఎప్పుడు లేనిది ఈ సీజన్ లో వరుసగా ఆరుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.

ఏడో వారం అది మారుతుందేమో ఈ సీజన్ మొదటి మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడని అనుకోగా 7వ వారం కూడా ఫిమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. హౌస్ నుంచి పూజా మూర్తి (Pooja Murthy) ఎలిమినేట్ అయ్యింది. రెండు వారాల క్రితమే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన పూజా ఎలిమినేషన్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. పూజా మూర్తి ఎలిమినేట్ అవ్వడంతో మళ్లీ హౌస్ లో ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

ఇక ఉల్టా పుల్టాలో భాగంగా ఇలా పూజా ఎగ్జిట్ అవడంతో పాటుగా రతిక రోజ్ (Rathika Rose) రీ ఎంట్రీ ఇచ్చింది. రతిక నాల్గో వారం ఎలిమినేట్ కాగా లాస్ట్ వీక్ హౌస్ మెట్స్ ఓటింగ్ తో లీస్ట్ ఓటింగ్ వల్ల రతిక రీ ఎంట్రీ ఛాన్స్ దక్కించుకుంది. ఆల్రెడీ బయటకు వచ్చి ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది ఎవరిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారన్నది తెలుసుకున్న రతిక హౌస్ లోకి వెళ్లి ఎలాంటి ఆట ఆడుతుంది అన్నది చూడాలి.

Also Read : Prabhas : హ్యాపీ బర్త్‌డే ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ స్టోరీ..