Bigg Boss 6: ఐదవ వారం చలాకీ చంటి ఎలిమినేషన్.. ఇందులో నిజమెంత?

బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే నాలుగు వారాలని విజయవంతంగా పూర్తి చేసుకుని ఐదవ వారం కూడా

Published By: HashtagU Telugu Desk
Bigg Boss Season 6

Bigg Boss Season 6

బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే నాలుగు వారాలని విజయవంతంగా పూర్తి చేసుకుని ఐదవ వారం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లు వీరే అంటూ పలువురు పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ ఈ వారం మాత్రం పేర్లు బలంగానే వినిపిస్తున్నాయి. 5వ వారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫైమా, బాలాదిత్య, వాసంతి ఇనయ, చంటి, అర్జున్, ఆదిరెడ్డి, మెరీనాలు నామినేషన్స్‌లో ఉన్నారు.

వీళ్ల మధ్య ఓటింగ్ హోరా హోరీగా సాగింది. అయితే వీకెండ్‌కి వచ్చేసరికి గ్రాఫ్ చాలా వరకు తగ్గిపోయింది. బాలాదిత్య, వాసంతి , చంటి, అర్జున్, మెరీనాల మధ్య హోరా హోరీ ఓటింగ్ సాగింది. కాగా ప్రతివారం ఒకరిద్దరు డేంజర్ జోన్‌లో ఉండగా,ఈవారం ఏకంగా బాలాదిత్య, వాసంతి , చంటి, అర్జున్, మెరీనా నలుగురు డేంజర్‌లోనే ఉన్నారు. అయితే అర్జున్ కళ్యాణ్‌కి కాస్త సింపథీ ఓట్లు పడటంతో అతి తక్కువ శాతం ఓట్లతో బయటపడ్డాడు.

ఇక మిగిలిన ముగ్గురు బాలాదిత్య, చంటి, మెరీనా ఈ ముగ్గురి చివరి వరకూ నువ్వు వెళ్తావా? నన్ను వెళ్లమంటావా? అన్నట్టుగా పోటీ పడగా ముగ్గురిలో చలాకీ చంటి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా గత మూడు రోజులుగా చలాకీ చంటి హోమ్ సిక్ కావడంతో పాటు,భోజనం కూడా సరిగా చేయట్లేదని పెర్ఫామెన్స్ కూడా సరిగా ఇవ్వలేకపోతుండటంతో ఇతన్ని హౌస్ నుంచి పంపించడానికి బిగ్ బాస్ నిర్వాహకులు ఫిక్స్ అయ్యారనేది తాజా సమాచారం. మొత్తానికి చలాకి చంటి ఐదవ వారం ఎలిమినేషన్ అవ్వడం పక్క అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

  Last Updated: 09 Oct 2022, 12:21 AM IST