Priyanka Jain: మరింత విషమించిన బిగ్ బాస్ ప్రియాంక జైన్ తల్లి ఆరోగ్యం.. ప్రస్తుత పరిస్థితి ఇదే?

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వకముందే త

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 10:00 AM IST

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వకముందే తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమైన మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్ తో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి చివరి వరకు పోరాడి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ ద్వారా ప్రియాంకకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. వారిలో ప్రియాంక జైన్ ఒకరు.

టాప్ 5 లో నిలిచింది. బిగ్ బాస్ తర్వాత తన తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని షాక్ అయింది ప్రియాంక. తన తల్లి క్యాన్సర్ తో బాధపడుతుందని తెలుసుకొని ఎమోషనల్ అయ్యింది ప్రియాంక. అయితే ఇటీవల తల్లి ఆరోగ్యం గురించి ఒక వీడియోని ఫోటోలను విడుదల చేస్తూ ఎమోషనల్ అవుతూ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లకపోయి ఉంటే బాగుండేది అంటూ కన్నీరు పెట్టుకుంది ప్రియాంక. తాజాగా ప్రియాంకా మరోసారి తన తల్లి ఆరోగ్యం గురించి తెలిపింది. తన తల్లి పరిస్థితి మరింత విషమించిందని తెలిపింది ప్రియాంక జైన్. తన తల్లిని హాస్పటల్ లో చేర్పించాం అని తెలిపింది. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని. కీమో థెరపీ చేశారని.. కన్నీళ్లు పెట్టుకుంది.

తన తల్లికి జుట్టు అంటే చాలా ఇష్టమని, కానీ ఇప్పుడు కీమో థెరపీ వల్ల తన జుట్టు మొత్తం పోయిందని,ఇలా చేయడం తనకు ఇష్టం లేదు, కానీ ఆమె ఆరోగ్యం కోసం తప్పలేదు అని తెలిపింది ప్రియాంక. ఇదంతా వీడియోలో చెప్పడానికి కారణం కూడా ఉందని తెలిపింది. ఈవీడియోల వల్లే తనకు డబ్బులు వస్తున్నాయని తెలిపింది ప్రియాంక. ఈ సందర్భంగా తన తల్లి పరిస్థితి తలుచుకొని మరొకసారి కన్నీళ్లు పెట్టుకొని ప్రియాంక. అందుకు సంబంధించిన పోస్టులు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రియాంక అభిమానులు ఏమీ కాదు..అమ్మ బాగుంటుంది.. మీరు ధైర్యంగా ఉండండి. అమ్మకు ఏమీ కాదు ఆరోగ్యం నయం అవుతుంది అంటూ ప్రియాంకకు ధైర్యం చెబుతున్నారు అభిమానులు.