బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బ్రహ్మముడి సీరియల్ నటుడు మానస్ నాగుల పల్లి (Bigg Boss Maanas) రీసెంట్ గా తండ్రైన సంగతి తెలిసిందే. మానస్ భార్య శ్రీజ (Srija).. మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ కుమారుడి నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించి.. తమ కుమారుడికి రామ్ చరణ్ మూవీ టైటిల్ ను పెట్టి వార్తల్లో నిలిచారు. 2023 నవంబర్ నెలలో మానస్ ..శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. రీసెంట్ గా శ్రీజ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేసారు.
మా ఇంట్లో పుట్టిన స్టార్‌కి ప్రతి క్షణం విశ్వమంతా ప్రేమను అందిస్తున్నాం. ధ్రువ (Dhruva) నాగులపల్లి.. మా ప్రపంచంలోకి నీకు స్వాగతం. అంటూ మానస్ తన కుమారుడ్ని ఎత్తుకున్న ఫొటోలను పంచుకున్నాడు. ఇక ఈ పోస్ట్ కింద ఫ్యాన్స్, ఫాలోవర్లు మానస్‌కి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ధ్రువ పేరు చాలా బాగుందంటూ ఆశీర్వదిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన మానస్.. తన కొడుకు పేరును ధ్రువ అని పెట్టాడు. ధృవ రామ్ చరణ్ హిట్ మూవీ టైటిల్ కావడం విశేషం. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు మానస్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించాడు. కానీ అనుకున్న సక్సెస్ రాలేదు. 2021లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 5 లో మానస్ కంటెస్ట్ చేశాడు. ఈ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనంతరం కార్తీకదీపం సీరియల్ లో హీరోగా చేశాడు. ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాడు. స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ టాప్ రేటెడ్ షోగా ఉంది.
Read Also : Nothing India : సేవా కేంద్రాలతో సర్వీస్ నెట్ వర్క్ ను విస్తరించిన నథింగ్ ఇండియా