Site icon HashtagU Telugu

Amardeep : ఎవర్ని వదిలిపెట్టను అంటూ హెచ్చరించిన బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్

Bigg Boss Amardeep

Bigg Boss Amardeep

బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ (Bigg Boss Amardeep) చౌదరి తనపై జరిగిన దాడిని మరచిపోలేకపోతున్నాడు. బిగ్ బాస్ (Bigg Boss) విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) అభిమానులు అతనిపై, అతని కుటుంబంపై జరిగిన దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బిగ్ బాస్ ఫైనల్ అనంతరం అమర్ దీప్, అతని తల్లిదండ్రులు, భార్య, స్నేహితులు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు రాగానే, కొందరు వ్యక్తులు వారిపై దాడి చేశారు. కేవలం అమర్ దీప్ మాత్రమే కాదు, అతని తల్లిని, భార్యను దూషిస్తూ, కారు ధ్వంసం చేశారు. అంతే కాకుండా మరికొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్లను కూడా పగులగొట్టారు.

AB de Villiers On Rohit Sharma: రోహిత్ ఎందుకు రిటైర్ కావాలి? ఏబీ డివిలియ‌ర్స్ కీల‌క వ్యాఖ్య‌లు!

తన కుటుంబం రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి తలెత్తడంతో అమర్ దీప్ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ సాధారణ గేమ్ షో తర్వాత తన కుటుంబం ఇలాంటి అవమానం ఎదుర్కోవాల్సి వచ్చిందని, తన తల్లిదండ్రులు, భార్య భయంతో బిక్కుబిక్కుమంటూ ఆ దాడి నుంచి తప్పించుకున్నారని చెప్పాడు. తన ఫ్రెండ్ నరేష్ లొల్ల సైతం వారితో పాటు ఉండగా, కారులోనే ప్రాణాలకు ముప్పుగా అనిపించిందని గుర్తు చేసుకున్నాడు. ఈ ఘటన తర్వాత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. కానీ, అతను బెయిల్‌పై విడుదలై వచ్చాడు. ఈ ఉదంతం బిగ్ బాస్ సీజన్ 7లో అత్యంత చర్చనీయాంశంగా మారింది.

Gods Laddoo Shop: దేవుడి లడ్డూ షాప్.. డబ్బులుంటే ఇవ్వొచ్చు.. లేకుంటే ఫ్రీ

తాజా ఇంటర్వ్యూలో అమర్ దీప్ తన మనసులోని భావాలను స్పష్టంగా వెల్లడించాడు. తనపై జరిగిన దాడిని మరచిపోనని, కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరిక చేశాడు. “ఆ రోజు నన్ను ఎక్కడ, ఎలా అవమానించారో నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. గెలిచిన వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నేను మాత్రం నా కుటుంబంతో కలిసి రోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఇదే నా జీవితానికి ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది. నన్ను అడ్డుకున్న వాళ్లందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అంటూ తన ఆవేశాన్ని బయటపెట్టాడు. రివేంజ్ తీర్చుకునేందుకు ఎంత సమయం పట్టినా తాను వెనకడుగు వేయనని స్పష్టం చేశాడు.