Bigg Boss 8 : బిగ్‍బాస్ హౌస్‌లోకి చైతు, శోభిత.. నెటిజన్ల ఎదురుచూపులు

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ గురించి పెద్దఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.

Published By: HashtagU Telugu Desk
Akkineni Compound Cleared the Rumors about Naga Chaitanya Shobhita Marriage Netflix Deal

Akkineni Compound Cleared the Rumors about Naga Chaitanya Shobhita Marriage Netflix Deal

Bigg Boss 8 : బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ సెప్టెంబర్ 1న మొదలైంది. ఈసారి షోలో ఒక్కరిద్దరు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ ప్రజలకు పెద్దగా తెలియదు. దీంతో ఎవర్రా మీరంతా అంటూ నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ గురించి పెద్దఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఈనేపథ్యంలో  బిగ్‍బాస్ హౌస్‌లోకి పలువురు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రత్యేక అతిథులు కూడా హాజరై సందడి చేయబోతున్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ లిస్టులో నాగ చైతన్య, శోభితలు సైతం ఉన్నారని అంటున్నారు.  వారిద్దరికి ఇటీవలే వివాహ నిశ్చితార్థం జరిగింది. త్వరలో మ్యారేజ్ జరగబోతోంది. ఈనేపథ్యంలో వారిద్దరు కలిసి బిగ్ బాస్ హౌస్‌‌లోకి(Bigg Boss 8) అడుగుపెడితే రేటింగ్స్ ఒక్కసారిగా పెరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

సాధారణంగానైతే  తమ సినిమాల ప్రమోషన్ కోసమే సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెడుతుంటారు. కానీ నాగ చైతన్య, శోభితలు ఏవిధంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే దానిపై ఇంకా ఎవ్వరికీ క్లారిటీ లేదు. దీనిపై బిగ్‌ బాస్ నిర్వాహకుల నుంచి కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో మాత్రం దీనిపై హాట్ డిబేట్ నడుస్తోంది.ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాలో నాగ చైతన్య నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఈసారి 14 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో ప్రారంభమైంది. షో మొదలైనప్పటి నుంచి బిగ్‌బాస్ నాగార్జున రకరకరాల టాస్కులతో కంటెస్టెంట్లకు కొత్తకొత్త సవాళ్లను విసురుతున్నారు.  అయితే ఈసారి షోను చాలా తక్కువ మంది కంటెస్టెంట్లతో ప్రారంభించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వాస్తవానికి బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ కోసం వందలాది మందిని ఇంటర్వ్యూ చేశారు. చివరకు 60 మందిని షార్ట్ లిస్ట్ చేసి, వారిలోనూ 25 మందిని బోర్డుపైకి తీసుకున్నారు. వారికి రెమ్యునరేషన్లను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

  Last Updated: 04 Sep 2024, 11:54 AM IST