Site icon HashtagU Telugu

Bigg Boss 7 : ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నది ఎవరు.. ఇక్కడ కూడా బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి..?

Bigg Boss 7 Those Contestent Won The Eviction Pass

Bigg Boss 7 Those Contestent Won The Eviction Pass

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో 11వ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ జరిగింది. హౌస్ లో ఉన్న పదిమందిని ఎవరు ఏ స్థానంలో ఉన్నారని భావిస్తున్నారో అంటూ చిన్న టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ వారిలో చివరి ఐదు స్థానాల్లో ఉన్న వారికి ఎవిక్షన్ పాస్ టాస్క్ ఇచ్చాడు. అందులో అమర్, అర్జున్, రతిక, అశ్విని, గౌతం ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో అర్జున్ గెలిచాడు. అయితే ఆ టాస్క్ గెలవగానే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇవ్వలేదు.. మళ్లీ దాని కోసం టాప్ 5 లో ఉన్న వారిలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఒక ఆట ఆడాల్సి ఉంటుంది.

ఆ ఆటలో గెలిచిన వారికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దొరుకుతుంది. అర్జున్ తన ఆపోనెంట్ గా యావర్ ని ఎంపిక చేసుకున్నాడు. బాల్స్ ని బిగ్ బాస్ చెప్పినట్టుగా అమర్చడంలో యావర్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచాడు. ఈ టాస్క్ కి అమర్ సంచాలక్ గా ఉన్నాడు. యావర్ అర్జున్ లలో జరిగిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఆటలో యావర్ గెలిచినట్టుగా అమర్ చెప్పాడు.

ఎవిక్షన్ ఫ్రీ పాస్ అవసరం యావర్ కి వస్తుందా రాదా అన్నై తెలియదు కానీ అతను మాత్రం తన ఫ్రెండ్ రతిక కోసం అది వాడితే అతను ఇరకాటంలో పడినట్టే అని చెప్పొచ్చు. టాప్ 5 లో యావర్ కూడా ఉండేందుకు అవకాశం ఉంటున్నా రతిక మాత్రం అతని ఆటకి అడ్డుగా మారుతుంది. అందుకే రతిక రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి యావర్ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది.

Also Read : Bigg Boss 17 : బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌..అసలు ఏంజరుగుతుంది..!

We’re now on WhatsApp : Click to Join