Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిదవ వారం హౌస్ నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ పూర్తైనట్టు తెలుస్తుంది. ఆదివారం ఎపిసోడ్ ని శనివారం షూటింగ్ పూర్తి చేస్తారు. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి లీకులు వచ్చేస్తాయి. 8వ వారం ఎలిమినేట్ అయిన ఆ కంటెస్టెంట్ ఎవరంటే సందీప్ మాస్టర్ అని తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే అతను ఈ వారం మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చాడు. గత ఏడు వారాలుగా నామినేషన్స్ లో లేని సందీప్ మాస్టర్ నామినేట్ అయిన ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవడం ఆశ్చర్యకరంగా ఉంది.
హౌస్ లోకి వెళ్లగానే మొదటి పవర్ అస్త్ర అందుకుని ఐదు వారాలు ఇమ్యూనిటీ పొందిన సందీప్ (Sandeep) ఐదు వారాలు నామినేషన్స్ లో లేకుండా సేఫ్ అయ్యాడు. ఇక ఆరో వారం, ఏడవ వారం కూడా నామినేషన్స్ లోకి రాలేదు. ఈ వీక్ నామినేషన్స్ లోకి రావడం ఎలిమినేట్ అవడం జరిగింది. అయితే సందీప్ తో పాటుగా శోభా శెట్టికి కూడా తక్కువ ఓట్స్ వచ్చినా ఈ సీజన్ లో ఇప్పటివరకు 7 ఎలిమినేషన్స్ జరుగగా ఏడుగురు లేడీ కంటెస్టెంట్స్ బయటకు వచ్చారు.
అందుకే ఈసారి సందీప్ హౌస్ ని వీడాల్సి వచ్చింది. అసలు సందీప్ ఇలా నామినేషన్స్ లోకి వచ్చిన మొదటి వారమే ఎలిమినేట్ అవుతాడని ఎవరు ఊహించి ఉండరు. సందీప్ ఎలిమినేషన్ అమర్ దీప్, ప్రియాంక, శోభా ఇంకా కొంతమందికి షాకింగ్ గా అనిపించి ఉండొచ్చు. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా లో భాగంగా ఈ సీజన్ ఎలిమినేషన్స్ కూడా షాకింగ్ గానే ఉన్నాయి.
Also Read : Israel-Hamas Conflict: ఐక్యరాజ్యసమితి తీర్మానానికి మోడీ ఎందుకు దూరంగా ఉన్నాడు?
We’re now on WhatsApp : Click to Join